Home > క్రీడలు > IND vs ENG : రనౌట్‌ అయిన గిల్‌ .. క్రీజులోకి యశస్వీ జైస్వాల్

IND vs ENG : రనౌట్‌ అయిన గిల్‌ .. క్రీజులోకి యశస్వీ జైస్వాల్

IND vs ENG : రనౌట్‌ అయిన గిల్‌ .. క్రీజులోకి యశస్వీ జైస్వాల్
X

రాజ్‌కోట్‌లో తన నాలుగో టెస్టు సెంచరీని కోల్పోయిన భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. నిరాశతో తన బ్యాట్‌ను పగులగొట్టాడు. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టులో గిల్ 91 పరుగులు చేసి ఔటయ్యాడు. రన అవుట్ అయి సెంచ‌రీని మిస్ చేసుకున్నాడు. టామ్ హ‌ర్ట్లే బౌలింగ్‌లో అనూహ్యంగా ర‌నౌట‌య్యాడు. బ్యాటింగ్‌ చేస్తున్న కుల్‌దీప్‌ పరుగుకోసం పిలిచి మళ్లీ వెనక్కి వెళ్లాడు. అప్పటికే గిల్‌ సంగం దూరం పరుగెత్తాడు. వెనక్కి వచ్చేలోపు బెన్‌స్టోక్స్‌ బంతిని విసరడంతో బౌలర్‌ హార్ట్‌లి గిల్‌ను ఔట్‌ చేశాడు. దాంతో, గిల్ నిరాశ‌గా పెవిలియ‌న్ చేరాడు. 90 పరుగులు చేసిన తర్వాత గిల్ ఔట్ కావడం ఇది రెండోసారి. మూడో రోజు సెంచ‌రీ త‌ర్వాత రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగిన య‌శ‌స్వీ జైస్వాల్(104) క్రీజులోకి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం టీమిండియా స్కోర్… 257/3. ప్ర‌స్తుతానికి రోహిత్ సేన‌ 383 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.





మూడో రోజు కుల్దీప్, జ‌డేజాలు తిప్పేయ‌గా.. సిరాజ్ నాలుగు వికెట్ల‌తో స్టోక్స్ సేనకు చుక్కలు చూపించాడు. ఆ దెబ్బ‌కు ఇంగ్లండ్ 319 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశ‌గా సాగుతోంది. యువ‌ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్‌(104 : 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ సెంచ‌రీకి తోడూ శుభ్‌మ‌న్ గిల్(65 నాటౌట్) హాఫ్ సెంచ‌రీ బాదడంతో భారీ స్కోర్ చేసింది. 2 వికెట్ల న‌ష్టానికి 196 ర‌న్స్ కొట్టింది. దాంతో, ఆట ముగిసే స‌రికి రోహిత్ సేన ఆధిక్యం 322 ప‌రుగుల‌కు చేరింది.








Updated : 18 Feb 2024 11:20 AM IST
Tags:    
Next Story
Share it
Top