Home > క్రీడలు > India vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌.. ఫీల్డింగ్ ఎవరిదంటే..

India vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌.. ఫీల్డింగ్ ఎవరిదంటే..

India vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌.. ఫీల్డింగ్ ఎవరిదంటే..
X

వన్డే ప్రపంచకప్​లో భాగంగా భారత్​- ఇంగ్లాండ్​ తలపడనుంది. లఖ్​నవూ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్​ గెలుచుకున్న ఇంగ్లాండ్​ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ దూరమవుతాడన్న వార్తలకు చెక్​ పడింది. గేమ్​కు రోహిత్​ వచ్చేశాడు. టాస్‌ సమయంలో జోస్‌ బట్లర్‌తో కలిసి రోహిత్ మైదానంలోకి వచ్చాడు.

ఇక.. ఇంగ్లండ్ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. టీమిండియా కూడా ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచులో గెలిస్తే టీమిండియా డైరెక్ట్ గా సెమీస్ లో అడుగుపెడుతుంది. దీంతో.. ఇంగ్లండ్ ను ఓడించి.. సెమీస్ రేసులో దూసుకుపోవాలని టీమిండియా భావిస్తుంది. మరోవైపు.. ఇంగ్లండ్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో ఓడిపోయి.. కేవలం ఒక దాంట్లో మాత్రమే నెగ్గింది. మెగాటోర్నీకి ముందు రెండు జట్లు కూడా టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగాయి. కానీ సగం టోర్నీ ముగిసే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బ్రేకుల్లేని ట్రైనులా టీమిండియా దూసుకుపోతుంటే.. పంక్చర్ పడ్డ సైకిల్ లా ఇంగ్లండ్ పరిస్థితి తయారైంది. అఫ్ఘానిస్థాన్, శ్రీలంక వంటి చిన్న జట్ల చేతిలో పరాజయం పాలైన ఇంగ్లాండ్.. దాదాపుగా సెమీస్‌కు దూరమైంది. ఏదైనా.. అద్భుతం జరిగితే తప్ప.. ఇంగ్లండ్ సెమీస్ వెళ్లడం కష్టమే. ఇక.. టీమిండియా చేతుల్లోనూ ఓడితే.. ఇంగ్లండ్ సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది.

తుది జట్లు ఇవే..

టీమ్​ఇండియా : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్​ కీపర్​), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(వికెట్​ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్




Updated : 29 Oct 2023 2:04 PM IST
Tags:    
Next Story
Share it
Top