Home > క్రీడలు > IND vs NZ: టాస్​ గెలుచుకుని బౌలింగ్​ ఎంచుకున్న రోహిత్​ సేన..

IND vs NZ: టాస్​ గెలుచుకుని బౌలింగ్​ ఎంచుకున్న రోహిత్​ సేన..

IND vs NZ: టాస్​ గెలుచుకుని బౌలింగ్​ ఎంచుకున్న రోహిత్​ సేన..
X

వన్డే ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్‌ (IND vs NZ) మధ్య జరగబోయే రసవత్తర మ్యాచ్‌లో టీమ్‌ఇండియా టాస్‌ నెగ్గింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఛేజింగ్‌కు మొగ్గు చూపాడు. దీంతో తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ ఇరు మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో గెలిచిన జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లనుంది.

భారత తుది జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్), సూర్యకుమార్‌ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా, షమీ, సిరాజ్

న్యూజిలాండ్ జట్టు

డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్‌ లేథమ్ (వికెట్ కీపర్/కెప్టెన్), గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్


Updated : 22 Oct 2023 1:53 PM IST
Tags:    
Next Story
Share it
Top