IND vs PAK: 350.. బూడిదలో వేసిన పన్నీరేనా?
X
కొలంబో వేదికగా భారత్- పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్ ను వరుణుడు వదిలిపెట్టడం లేదు. మొదటి రోజు వర్షం కారంణంగా రద్దుచేసి.. ఇవాళ రిజర్వ్ డే రోజు జరుపిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రాంరభం కావాల్సిన మ్యాచ్ 4:40 కి ప్రారంభం అయింది. 24.1 ఓవర్ నుంచి భారత్ ఆట కొనసాగించినంత సేపు వరుణుడు సాధించాడు. దాంతో ఇరు జట్లు పోరుకు ఏ ఆటంకం ఉండదని ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. 50 ఓవర్లు పూర్తిగా బ్యాటింగ్ చేసిన భారత్ 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. 357 పరుగులు లక్ష్యంలో బరిలోకి దిగిన పాక్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 ఓవర్లలోపే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (9,18 బంతుల్లో), కెప్టెన్ బాబర్ ఆజమ్ (10, 24 బంతుల్లో) ప్రస్తుతం పాక్ స్కోర్ 44/2 11 ఓవర్లకు.. ఆడుతుండగా వర్షం అంతరాయం కల్గించింది.
వర్షం ఇలానే కొనసాగితే మ్యాచ్ ను రద్దు చేసి రెండు టీంలకు చెరో పాయింట్ ఇస్తారు. ప్రస్తుతం పాక్ ఉన్న పరిస్థితి చూస్తుంటే.. భారత్ కన్నా వెనకపడే ఉంది. 10 ఓవర్లలో భారత్ ఒక్క వికెట్ కోల్పోకుండా.. 61 పరుగులు చేసింది. ఈ లెక్కన చూసుకుంటే వర్షం పడితే భారత్ ను విజేతగా ప్రకటించాలి. కానీ అలా జరగదు. ఎందుకంటే భారత్ 50 ఓవర్లు బ్యాటింగ్ చేయగా.. మ్యాచ్ ను డీఎల్ఎస్ మెథడ్ లో విజేతను ప్రకటించాలంటే.. పాకిస్తాన్ మినిమం 20 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అది సాధ్యం కాకపోతే మ్యాచ్ ను రద్దు చేస్తారు.
వర్షం తగ్గి మ్యాచ్ ను కొనసాగించే పరిస్థితి ఉండి.. పాక్ కు డీఎల్ఎస్ మెథడ్ లో టార్గెట్ ని ఇస్తే భారీ స్కోర్ చేయాల్సి ఉంటుంది. డీఎల్ఎస్ ప్రకారం పాకిస్తాన్.. 20 ఓవర్లలో 200 పరుగులు చేయాల్సి ఉంటుంది. 22 ఓవర్లలో 216 పరుగులు, 24 ఓవర్లలో 230 పరుగులు, 26 ఓవర్లలో 244 పరుగులు చేయాల్సి ఉంటుంది. మ్యాచ్ జరగడానికి ఇంకా 3 గంటలు సమయం ఉండగా ఏం జరుగుతుందో చూడాలి. భారత అభిమానులు మాత్రం మ్యాచ్ జరగాలని, వరుణుడు శాతించాలని కోరుకుంటున్నారు. పాక్ పై గెలుపుతో సూపర్ 4ను మొదలుపెట్టాలని ఆశిస్తున్నారు.