Home > క్రీడలు > India vs Pakistan Hockey: పాక్​పై భారత్​ ఘన విజయం.. అజేయంగా సెమీస్‌కు

India vs Pakistan Hockey: పాక్​పై భారత్​ ఘన విజయం.. అజేయంగా సెమీస్‌కు

India vs Pakistan Hockey: పాక్​పై భారత్​ ఘన విజయం.. అజేయంగా సెమీస్‌కు
X

ప్రతిష్ఠాత్మక ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో దాయాది పాకిస్తాన్ జట్టుపై భారత్ విజయం సాధించింది. చెన్నై వేదికగా సొంతగడ్డపై బుధవారం జరిగిన హాకీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత జట్టు చిత్తు చేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ లీగ్ ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై 4-0 తేడాతో భారత్ గెలిచింది. ది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్‌..చివరి వరకు దూసుకెళ్లింది. భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ (15వ, 23వ) కొట్టగా.. మరో ప్లేయర్​ జుగ్‌రాజ్‌ సింగ్‌ (36వ), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (55వ) చెరో గోల్​ను సాధించారు. అయితే మూడు గోల్స్‌ పెనాల్టీ కార్నర్ల ద్వారా వచ్చాయి. ఇక ఆకాశ్‌దీప్‌ ఫీల్డ్‌ గోల్‌ సాధించాడు. దాంతో లీగ్‌ దశను ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా ముగించింది. 5 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి, ఒకదాన్ని డ్రాగా ముగించిన హర్మన్‌ప్రీత్‌ టీమ్​..13 పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో జపాన్‌ను ఢీకొట్టనుంది. మరో సెమీస్‌లో మలేసియా, కొరియా తలపడతాయి.

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆరు జట్లు తలపడ్డాయి. 4 మ్యాచ్‌ల్లో టీమిండియా హాకీ జట్టు మూడు విజయాలు, ఓ డ్రా కలిపి 10 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉండగా.. నిన్న జరిగిన మ్యాచ్ సైతం నెగ్గి ఓటమి లేకుండా లీగ్ ముగించింది. ప్రత్యర్థి పాక్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. నేటి మ్యాచ్‌తో కలిపి లీగ్ స్టేజ్ లో కేవలం ఒక్క మ్యాచ్ నెగ్గింది. పాక్‌ మరో రెండు డ్రా చేసుకోగా, ఓ మ్యాచ్ లో ఓటమిపాలైంది. సెమీస్‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో.. కనీసం ఒక్క గోల్ కూడా చేయకుండా ఇంటి దారి పట్టింది.





పాక్​తో జరిగిన పోరులో భారత జట్టు ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌కు ముందే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన టీమిండియా.. మరింత దూకుడుతో ఆడింది. తొలి క్వార్టర్‌ ఆఖరిలో లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ ఓ బలమైన లో ఫ్లిక్‌తో సద్వినియోగం చేశాడు. ఇక 23వ నిమిషంలో భారత్‌కు రెండో పెనాల్టీ కార్నర్‌ లభించింది. హర్మన్‌ప్రీత్‌ దాన్ని కూడా వృథా పోనివ్వలేదు.బలమైన డ్రాగ్‌ ఫ్లిక్‌తో పాకిస్థాన్‌ గోల్‌కీపర్‌ అక్మల్‌ కాళ్ల మధ్య నుంచి నెట్​లోకి కొట్టి భారత్‌ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఆ తర్వాత కూడా వరుస దాడులతో పాకిస్థాన్‌ టీమ్ కు చుక్కలు చూపించింది. ఫలితంగా 30వ నిమిషంలో వరుసగా రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. అయితే ఆ రెండు అవకాశాలను ఉపయోగించుకోవడంలో హర్మన్‌ప్రీత్‌ విఫలమయ్యాడు.





15, 23 నిమిషాలలో గోల్ కొట్టి భారత్ ను అధిక్యంలో నిలిపాడు హర్మన్ ప్రీత్ సింగ్ . 36వ నిమిషంలో గుర్జన్ సింగ్ గోల్ చేయడంతో భారత్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ ముగియడానికి 5 నిమిషాల ముందు మన్ దీప్ సింగ్ మరో గోల్ గొట్టడంతో ప్రత్యర్థి పాక్ పై భారత్ 4-0 గోల్స్ తేడాతో పూర్తి ఆధిక్యం కనబరిచింది. అయితే భారత రక్షణ వ్యవస్థను ఛేదించలేక పాక్ జట్టు మొదట్నుంచీ ఇబ్బంది పడింది. దాంతో కనీసం మ్యాచ్ ముగిసేసరికి ఒక్క గోల్ కూడా చేయలేక పోయింది. భారత్ చేతిలో ఓటమితో పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించినట్లే.














Updated : 10 Aug 2023 8:07 AM IST
Tags:    
Next Story
Share it
Top