భారత్-పాక్ మ్యాచ్కు అడ్డుతగిలిన వాన
X
అనుకున్నట్టుగానే భారత్ - పాక్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. భారీ వర్షం కురుస్తుండడంతో కొలంబొ ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఆ మ్యాచ్ నిలిచిపోయింది. భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల వద్ద భారీ వర్షం మొదలైంది. దీంతో అంపైర్లను ఆటను నిలిపేశారు. మ్యాచ్ నిలిచిపోయేసరికి భారత్ స్కోరు 147/2 కాగా విరాట్ కోహ్లీ 8, కేఎల్ రాహుల్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అర్ధసెంచరీలతో చెలరేగారు. 56 రన్స్ చేసిన రోహిత్ 16వ ఓవర్ లో ఔటవ్వగా.. 58 రన్స్ చేసిన గిల్ 18వ ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత టీమిండియా స్కోర్ నెమ్మదించింది. వరుస వికెట్లు పడడంతో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు రేపు రిజర్వ్ డే ఉంది.
భారత్ జట్టు :
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్ జట్టు
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవుఫ్