Home > క్రీడలు > India vs Pakistan: దాయాదుల సమరానికి రంగం సిద్ధం.. జట్టులోకి గిల్..

India vs Pakistan: దాయాదుల సమరానికి రంగం సిద్ధం.. జట్టులోకి గిల్..

India vs Pakistan: దాయాదుల సమరానికి రంగం సిద్ధం.. జట్టులోకి గిల్..
X

క్రికెట్ ఫ్యాన్స్కు అసలైన మజానిచ్చే మ్యాచ్ ఇవాళ జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు అమితుమీ తేల్చుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు జరిగే మ్యాచ్ కోసం భారత్ - పాక్ టీమ్స్ రెడీ అయ్యాయి. రెండు విజయాలతో రెండు టీంలు మంచి ఊపుమీదున్నాయి. ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్‌పై భారత్ విక్టరీ కొట్టగా.. నెదర్లాండ్, శ్రీలంకపై పాక్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్రత్యర్థికి గట్టి షాకివ్వాలని రెండు టీంలూ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఈ మ్యాచ్లో భారత్ ఫెవరేట్గా బరిలోకి దిగుతోంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తోంది. కోహ్లీ, రోహిత్, రాహుల్ మంచి ఫామ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో గిల్ కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ శుభ్‌మన్‌ తుది జట్టులో లేకపోతే ఇషాన్‌ కిషన్‌కు మరో అవకాశం దక్కనుంది. స్టార్‌ బౌలర్ బుమ్రా ఫామ్‌లో ఉండగా స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా రాణిస్తున్నారు. ఈ మ్యాచులో సిరాజ్ స్థానంలో షమీని తీసుకునే అవకాశం ఉంది. పాక్కు బౌలింగ్లో షహీన్‌ అఫ్రిది, హారిస్‌ రౌఫ్‌లతో పటిష్టంగా ఉండగా.. బ్యాటింగ్లో బాబర్ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ మంచి ఫామ్లో ఉన్నారు.

Updated : 14 Oct 2023 8:26 AM IST
Tags:    
Next Story
Share it
Top