Home > క్రీడలు > India Vs SA:నేటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో టెస్టు

India Vs SA:నేటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో టెస్టు

India Vs SA:నేటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో టెస్టు
X

దక్షిణాఫ్రికా పర్యటనలో ఆఖరి ఆటకు టీమిండియా రెడీ అయింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం (జనవరి 3) రెండో టెస్టు మొదలుకానుంది. రెండు టెస్టుల సిరీస్‍లో ఇప్పటికే తొలి మ్యాచ్‍లో ఘోరంగా ఓడి 0-1తో భారత్ వెనుకబడింది. సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని మరోసారి మిస్ చేసుకుంది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు మరో ఛాన్స్ వచ్చింది. మరోవైపు సొంతగడ్డపై జోరు మీదున్న సఫారీ జట్టు క్లీన్‌స్వీప్‌ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి జరిగే రెండో టెస్టులో భారత్, దక్షిణాఫ్రికా పోటీ పడబోతున్నాయి. భారత్‌ మ్యాచ్‌ ఓడినా, ‘డ్రా’ అయినా సిరీస్‌ను కోల్పోతుంది. కాబట్టి సమం చేయాలంటే ఈ టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆట మొదలుకానుంది. కేప్‍టౌన్‍లోని న్యూల్యాండ్స్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ ద్వారా మ్యాచ్ ను వీక్షించవచ్చు. డిజిటల్ విషయానికి వస్తే.. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

పిచ్, వాతావరణం

కేప్‍టౌన్‍లో జరిగే ఈ మ్యాచ్‍పై వర్షం ప్రభావం ఉండే అవకాశం చాలా తక్కువ. రెండో టెస్టు జరిగే ఐదు రోజులు ఆటకు వాన ఆటంకం కలిగించకపోచ్చు. ఇక, భారత్, దక్షిణాఫ్రికా తలపడే కేప్‍టౌన్ పిచ్ పేసర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. పిచ్‍పై పచ్చిక ఉంది. చివరి రెండు రోజులు స్పిన్నర్లకు కూడా మద్దతు లభిస్తుంది.

తుది జట్లు ఇలా..

భారత స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా పూర్తి ఫిట్‍నెస్ సాధించాడు. దీంతో రెండో టెస్టు తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో జడేజా వచ్చేయనున్నాడు. తొలి టెస్టులో విఫలమైన యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను భారత మేనేజ్‍మెంట్ కొనసాగిస్తుందా.. లేకపోతే ముకేశ్ కుమార్‌కు అవకాశం ఇస్తుందా అనేది చూడాలి. అలాగే గాయం వల్ల ఈ మ్యాచ్‍కు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా దూరం కానున్నాడు. డీన్ ఎల్గర్ కెప్టెన్సీ చేయనున్నాడు.

భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ/ముకేశ్ కుమార్

దక్షిణాఫ్రికా తుదిజట్టు (అంచనా): డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రమ్, టోనీ డీ జోర్జీ, కీగన్ పీటర్సన్, జుబైర్ హంజా, డేవిడ్ బెడిన్‍గమ్, కేల్ వెర్రైన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్ / లుంగీ ఎంగ్డీ, కగిసో రబాడ, నాడ్రే బర్గర్




Updated : 3 Jan 2024 3:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top