Home > క్రీడలు > IND vs SA: నేడే ఆఖరి వన్డే.. సిరీస్‌ దక్కేదెవరికో

IND vs SA: నేడే ఆఖరి వన్డే.. సిరీస్‌ దక్కేదెవరికో

IND vs SA: నేడే ఆఖరి వన్డే.. సిరీస్‌ దక్కేదెవరికో
X

వన్డే సిరీస్‌లో ఆఖరి సమరానికి వేళైంది. దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్‌ ‘డ్రా’చేసుకున్న టీమ్‌ఇండియా.. వన్డే సిరీస్‌ చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. నేడు నిర్ణయాత్మక పోరు జరుగనుంది. ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్‌లో అదుర్స్ అనిపించిన టీమిండియా ఆటగాళ్లు.. రెండో వన్డేలో అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లోనూ చేతులెత్తేశారు. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. ఇక సిరీస్‌ విజేతను తేల్చే ఈనాటి మ్యాచ్‌లో భారత్‌ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా టాపార్డర్‌ సత్తా చాటడంపైనే భారత్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓపెనింగ్‌ జోడీ శుభారంభం ఇవ్వలేకపోయింది. రెండు మ్యాచ్‌ల్లోనూ రుతురాజ్‌ గైక్వాడ్‌ తేలిపోగా..సాయి సుదర్శన్‌ రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. మరోవైపు దక్షిణాఫ్రికా ఓపెనర్లు జోజీ, హెన్‌డ్రిక్స్‌ తొలివన్డేలో విఫలమైనా..రెండో వన్డేలో మాత్రం పరుగుల వరద సృష్టించారు. జోజీ సెంచరీతో నాట్ అవుట్ గా నిలిచి సత్తాచాటాడు.

సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. రెండో వన్డే గెలిస్తే.. చివరి మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కేది. కానీ ఓటమి పాలవ్వడంతో ఆఖరి మ్యాచ్ గెలవడం కీలకమైంది. ఈ క్రమంలోనే ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. దీంతో చాలా రోజుల తర్వాత టీమిండియా పిలుపును అందుకున్న రజత్ పటీదార్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లకు మళ్లీ నిరాశే ఎదురవ్వనుంది. రింకూ సింగ్‌కు మరో అవకాశం ఇవ్వనున్నారు. ఒకవేళ రజత్ పటీదార్‌ను ఆడించాలనుకుంటే మాత్రం తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన తెలుగు తేజం తిలక్ వర్మపై వేటు వేయవచ్చు. సాయి సుదర్శన్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదినా.. రుతురాజ్ దారుణంగా విఫలమయ్యాడు. చివరి మ్యాచ్‌లోనైనా అతను సత్తా చాటాల్సిన అవసరం ఉంది. పార్ల్‌లో బోలాండ్ పార్క్ వేదికగా సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ను ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించివచ్చు. అలాగే డిస్నీ+ హాట్‌స్టార్‌లో కూడా ప్రసారం అవుతుంది.

తుది జట్టు(అంచనా)

భారత్‌: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), గైక్వాడ్‌, సాయి సుదర్శన్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌, ముకేష్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

దక్షిణాఫ్రికా : మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), జోరీ, హెన్‌డ్రిక్స్‌, క్లాసెన్‌, మిల్లర్‌, డుసెన్‌, మల్డర్‌, బర్గర్‌, కేశవ్‌, పెహ్లుక్వాయో, షంసీ.

పిచ్‌/వాతావరణం

వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. 250 పరుగులకు పైగా నమోదయ్యే అవకాశముంది. తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టుకు లాభించవచ్చు. వాతావరణం వేడిగా ఉంటుంది. వర్షానికి అవకాశం లేదు.

Updated : 21 Dec 2023 2:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top