Home > క్రీడలు > India vs South Africa: దక్షిణాఫ్రికాతో తలపడే 'యువ' భారత్ ఇదే

India vs South Africa: దక్షిణాఫ్రికాతో తలపడే 'యువ' భారత్ ఇదే

India vs South Africa: దక్షిణాఫ్రికాతో తలపడే యువ భారత్ ఇదే
X

ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకుని మంచి ఊపుమీదున్న యువ భారత్‌.. నేడు దక్షిణాఫ్రికాతో తొలి టీ 20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఫ్రీడమ్‌ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి ఈ పర్యటనలో శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు స్వదేశంలో అద్భుతమైన బ్యాటింగ్ ట్రాక్‌లపై ఆస్ట్రేలియాను 4-1తో ఓడించింది. ఇప్పుడు విదేశీ గడ్డపై భారత కుర్రాళ్లు ఏ మేరకు రాణిస్తుందనేది అసక్తికరంగా మారింది. కారణం.. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను దక్షిణాఫ్రికాలో ఎదుర్కోవడం అంత తేలిక కాదు. దక్షిణాఫ్రికాలో భారత బ్యాటర్లకు పేస్‌ ట్రాక్‌లతో సవాల్‌ ఎదురుకానుంది.





జట్టులోని శుభ్‌మన్‌ గిల్‌,రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌వర్మల బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉండడం.. టీమిండియాకు కలిసొచ్చే అంశం. బౌలింగ్ విషయానికొస్తే.. సిరాజ్‌ చేరికతో పేస్‌ బౌలింగ్‌ కాస్త బలోపేతమైంది. ఇక టీ20ల్లో నెంబర్‌ వన్‌ బౌలర్‌ అయిన రవి బిష్ణోయ్‌ స్పిన్ కూడా.. భారత్‌కు కలిసిరానుంది. దక్షిణాఫ్రికా కూడా పలువురు సీనియర్‌ ఆటగాళ్లు బవుమా, రబడా, నోర్జే, ఇన్‌గిడి గైర్హాజరీలో కొత్త ముఖాలతో బరిలోకి దిగుతుంది. మార్క్‌రమ్‌ నేతృత్వంలోని సఫారీ జట్టుకు సొంతగడ్డ అనుకూలతలు ఉన్నప్పటికీ టి20 ఫార్మాట్‌లో ఏదైనా సాధ్యమే! హెండ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్‌లు ధనాధన్‌ ఆటలో మెరిపించే సత్తా ఉన్నవారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ సమరం తప్పదు.

డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో జరుగబోయే ఈ మ్యాచ్.. ఈరోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. మొబైల్ వినియోగదారులు హాట్‌స్టార్ అప్లికేషన్‌లో ఉచిత స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు.




టీమిండియా జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాన్‌ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.




Updated : 10 Dec 2023 7:26 AM IST
Tags:    
Next Story
Share it
Top