Home > క్రీడలు > Asia cup final : ముందే వచ్చిన అతిథి.. ఆలస్యంగా ఆట ప్రారంభం..

Asia cup final : ముందే వచ్చిన అతిథి.. ఆలస్యంగా ఆట ప్రారంభం..

Asia cup final : ముందే వచ్చిన అతిథి.. ఆలస్యంగా ఆట ప్రారంభం..
X

ఆసియా కప్ తుది పోరులో భారత్ - శ్రీలంక తలపడుతున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పైనల్ మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత్ బౌలింగ్ చేయనుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది. దీంతో సిబ్బంది పిచ్ మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. వర్షంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ గాయపడ్డాడు.

అటు శ్రీలకం కూడా ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయపడ్డ తీక్షణ స్థానంలో దుషాన్‌ హేమంతను జట్టులోకి తీసుకుంది. గత 15 ఆసియా కప్ టోర్నీల్లో టీమ్ ఇండియా మొత్తం 10 సార్లు ఫైనల్ ఆడింది. ఫైనల్‌లో మూడుసార్లు ఓడిపోయింది. అది కూడా శ్రీలంకపైనే కావడం టీమిండియా అభిమానులనును ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఈరోజు జరగనున్న ఫైనల్స్ను టీమిండియా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

టీమిండియా : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక : పతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక, దునిత్ వెల్లలగే, దుషాన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీష పతిరణ

Updated : 17 Sep 2023 9:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top