Home > క్రీడలు > విండీస్తో సెకండ్ వన్డే.. వర్షం తగ్గడంతో స్టార్టైనా మ్యాచ్

విండీస్తో సెకండ్ వన్డే.. వర్షం తగ్గడంతో స్టార్టైనా మ్యాచ్

విండీస్తో సెకండ్ వన్డే.. వర్షం తగ్గడంతో స్టార్టైనా మ్యాచ్
X

వెస్టిండీస్ - భారత్ మధ్య రెండో వన్డే జరుగుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండో వన్డే బార్బడోస్లో జరుగుతోంది. ప్రస్తుతం భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. అయితే వర్షం పడడంతో మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది. ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల వద్ద మ్యాచ్ ఆగింది. అప్పటికీ భారత్ 5 వికెట్ల నష్టానికి 113 రన్స్ చేసింది. అయితే కొద్దిసేపటికి వర్షం తగ్గడంతో మ్యాచ్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. భారత బ్యాటర్లలో ఇషాన్ హాఫ్ సెంచరీ చేయగా.. గిల్34,శాంసన్9, పాండ్యా 7, అక్షర్ 1 రన్ చేసి ఔట్ అయ్యారు. విండీస్ బౌలర్లలో షెఫెర్డ్ 2 వికెట్లు తీయగా.. మెతీ, సీల్స్, కారీ తలో వికెట్ తీశారు.

ఈ వన్డేకు రోహిత్ శర్మ, కోహ్లీ దూరంగా ఉన్నారు. రోహిత్ లేకపోవడంతో పాండ్యా కెప్టెన్సీ చేస్తున్నాడు. రోహిత్, కోహ్లీ విరామం లేకుండా మ్యాచులు ఆడుతున్నారని.. అందుకే ఈ మ్యాచ్లో రెస్ట్ ఇచ్చినట్లు పాండ్యా తెలిపారు. రోహిత్, కోహ్లీ మ్యాచ్కు దూరంగా ఉండడంతో సంజూ శాంసన్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు. ఇక తొలి వన్డేలో భారత్ విక్టరీ కొట్టగా.. రెండో వన్డేలోనూ గెలిచి.. ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే బార్బడోస్ పిచ్ బౌలింగ్కు అనుకూలిస్తుంది. మరోవైపు వర్షం కూడా తోడవడంతో గెలుపెవరిదో వేచి చూడాలి.

టీమిండియా జట్టు : హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ముకేశ్‌కుమార్‌

విండీస్ జట్టు : షై హోప్‌(కెప్టెన్‌), కైల్‌ మేయర్స్‌, అలిక్‌ అథనేజ్‌, బ్రాండన్‌ కింగ్‌, షిమ్రోన్ హెట్‌మయేర్, కీచీ కార్టీ, రొమారియో షెఫెర్డ్‌, యానిక్‌ కారీ, గుడాకేశ్‌ మోతీ, అల్జర్రీ జోసెఫ్‌, జయడెన్‌ సీల్స్‌


Updated : 29 July 2023 4:55 PM GMT
Tags:    
Next Story
Share it
Top