Home > క్రీడలు > Ind vs Ned : ఆఖరి పోరుకు టీమిండియా రెడీ.. నెదర్లాండ్స్తో మ్యాచ్

Ind vs Ned : ఆఖరి పోరుకు టీమిండియా రెడీ.. నెదర్లాండ్స్తో మ్యాచ్

Ind vs Ned : ఆఖరి పోరుకు టీమిండియా రెడీ.. నెదర్లాండ్స్తో మ్యాచ్
X

ప్రపంచకప్ లీగ్ స్టేజ్ లో ఆఖరి పోరుకు టీమిండియా రెడీ అయింది. ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్ తో తలపడనుంది. దేశం ఓ వైపు దివాళి వేడుకల్లో మునిగిపోయి ఉంటే.. క్రికెట్ అభిమానులు మాత్రం విరాట్ కోహ్లీ 50 సెంచరీపై దృష్టి పెట్టారు. ఈ మ్యాచ్ లో విరాట్ సెంచరీ చేయాలని తమకు దిపావళి కానుక ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే సెమీస్ లో అడుగుపెట్టిన రోహిత్ సేనకు ఇది నామమాత్రపు మ్యాచ్. అయితే విరాట్ కోహ్లీకి బెంగళూరు సెకండ్ హోమ్ లాంటిది కావడంతో తప్పకుండా కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కీలక పోరుకు ముందు సూపర్ పర్ఫామెన్స్ ను ఆశిస్తున్నారు. 2011లో 282 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2015లో 305 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2019లో 443 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన కోహ్లీ.. ఈ టోర్నీలో ఇప్పటికే 543 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తిచేసి.. టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు. దీన్నిబట్టి చూస్తుంటే ఈ మ్యాచ్ లో కోహ్లీ 50 సెంచరీ పక్కా అని లెక్కలేసుకుంటున్నారు. కాగా ఈ మ్యాచ్ లో టీమిండియాకు గట్టిపోటీ ఇవ్వడానికి డజ్ సేన సిద్ధంగా ఉంది. లీగ్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను 38 పరుగుల తేడాతో ఓడించి అందరికీ షాక్ ఇచ్చింది. తర్వాత శ్రీలంకపై గెలిచింది. ఈ క్రమంలో ఆ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం.




Updated : 12 Nov 2023 8:15 AM IST
Tags:    
Next Story
Share it
Top