Asian games 2023: షూటర్ల హవా.. భారత్ ఖాతాలో మరో పసిడి
X
చైనాలో జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్ లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. మరో బంగారు పతకాన్ని దేశానికి అందించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీం ఈవెంట్ లో సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా బృందం పసిడి పట్టేసింది. దీంతో షూటింగ్ లో ఆరో గోల్డ్ భారత్ వశమైంది. ఇక పురుషుల షూటింగ్ వ్యక్తిగత విభాగంలోనే సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా పతకాల వేటకు అర్హత సాధించారు.
ఏషియన్ గేమ్స్ ఐదో రోజు ఆరంభంలోనే భారత్ కు రెండు పతకాలు (రజతం, పసిడి) దక్కాయి. ఇవాళ (సెప్టెంబర్ 28) తొలి పతకాన్ని రోషిబినా దేవి సాధించింది. వుషూ 60 కేజీల విభాగంలో ఫైనల్ కు చేరిన రోషిబినా పతకం నెగ్గింది. ఇక టేబుల్ టెన్నిస్ లో భారత జోడీకి ఓటమి పాలయింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో మొత్తం 24 పతకాలు ఉన్నాయి. పాయింట్స్ టేబుల్ లో ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో ఆరు గోల్డ్, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి.