Home > క్రీడలు > Asiacup 2023 : శ్రీలంకపై భారత్ సూపర్బ్ విక్టరీ

Asiacup 2023 : శ్రీలంకపై భారత్ సూపర్బ్ విక్టరీ

Asiacup 2023 : శ్రీలంకపై భారత్ సూపర్బ్ విక్టరీ
X

ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. రసవత్తంగా సాగిన ఈ మ్యాచ్లో 41 రన్స్ తేడాతో గెలిచింది. బ్యాటింగ్లో రోహిత్ హాఫ్ సెంచరీ చేయగా.. బౌలింగ్లో కుల్దీప్ 5 వికెట్లతో రాణించాడు. శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లంగలే 5 వికెట్లు పడగొట్టడంతోపాటు 42 రన్స్తో ఆకట్టకున్నాడు.

ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటింగ్ లో తడబడింది. స్పిన్ ఉచ్చుతో భారత బ్యాటర్లను లంక ఓల్తా కొట్టించింది. ఆసియా కప్ లో అరంగేట్రం చేసిన దునిత్ వెల్లంగలే తన స్పిన్ తో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మిస్టరీ స్పిన్ బంతులేస్తూ రోహిత్ శర్మ (53), విరాట్ కోహ్లీ (3), శుభ్ మన్ గిల్ (19), కేఎల్ రాహుల్ (39), హార్దిక్ పాండ్యా (5)లను పెవిలియన్ చేర్చాడు. 10 ఓవర్లు వేసిన దునిత్.. 4 సగటుతో 40 పరుగులే ఇచ్చుకున్నాడు. మిగతా లంక బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేస్తూ భారత బ్యాటర్లను కట్టడి చేయడంతో 212 రన్స్ కు టీమిండియా ఆలౌట్ అయ్యింది.

ఆ తర్వాత 213 ప‌రుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకను బుమ్రా దెబ్బ‌కొట్టాడు. రెండో ఓవ‌ర్‌లోనే పథుమ్ నిస్సంక‌(6)ను ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత కీల‌క‌మైన కుశాల్ మెండిస్‌(15)ను వెన‌క్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన దిముత్ క‌రుణ‌ర‌త్నే(2)ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 25 పరుగులకే లంక 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక కలిసి నాలుగో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కులదీప్ యాదవ్ 5, జడేజా రెండు వికెట్లతో చెలరేగడంతో శ్రీలంక 172 రన్స్కే ఆలౌట్ అయ్యింది.


Updated : 12 Sept 2023 11:16 PM IST
Tags:    
Next Story
Share it
Top