Home > క్రీడలు > IND vs ENG : దుమ్మురేపిన భారత్.. ఇంగ్లాండ్పై ఘన విజయం..

IND vs ENG : దుమ్మురేపిన భారత్.. ఇంగ్లాండ్పై ఘన విజయం..

IND vs ENG : దుమ్మురేపిన భారత్.. ఇంగ్లాండ్పై ఘన విజయం..
X

మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ను భారత్ చిత్తు చేసింది. 434 రన్స్ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 122 రన్స్కే ఆలౌట్ అయ్యింది. భారత్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ జట్టు బ్యాట్స్మెన్స్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. మార్క్ వుడ్ (33) మినహా మిగితా బ్యాట్స్మెన్లు 20 రన్స్ కూడా చేయలేకపోయారు. ఆరుగురు బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. రవీంద్ర జడేజా 5వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. జో రూట్, బెయిర్ స్టో,ఒల్లీ పోప్, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్ వికెట్లు తీసి ఇంగ్లాండ్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్ తలో ఒక వికెట్ తీశారు.

అంతకుముందు భారత రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. జైశ్వాల్ (214) డబుల్ సెంచరీతో చెలరేగడంతో 430 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఓవరాల్గా 556 లీడ్ సాధించింది. 231బంతుల్లోనే జైశ్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. రెండో టెస్టులో ఇంగ్లాడ్పై డబుల్ సెంచరీ చేసిన అతడు.. మూడో టెస్టులోనూ అదే రిపీట్ చేశాడు. దీంతో సొంత గడ్డపై ఒక సిరీస్‌లో 500+ రన్స్‌ చేసిన రెండో భారత బ్యాటర్‌ జైస్వాల్గా నిలిచాడు. 534 పరుగులతో మొదటి స్థానంలో గంగూలీ ఉన్నాడు. ఇక గిల్ 91 రన్స్ వద్ద రనౌట్ అవ్వడంతో సెంచరీ మిస్ అయ్యింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 445 రన్స్ చేయగా.. ఇంగ్లాండ్ 319 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Updated : 18 Feb 2024 11:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top