Home > క్రీడలు > IND vs NZ : వరల్గ్ కప్ ఫైనల్కు టీమిండియా.. న్యూజిలాండ్పై ఘన విజయం

IND vs NZ : వరల్గ్ కప్ ఫైనల్కు టీమిండియా.. న్యూజిలాండ్పై ఘన విజయం

IND vs NZ : వరల్గ్ కప్ ఫైనల్కు టీమిండియా.. న్యూజిలాండ్పై ఘన విజయం
X

వరల్డ్ కప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలోకి ఓటమెరుగని టీంగా సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 70 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. 398 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 327 రన్స్కే ఆలౌట్ అయ్యింది. డారిల్ మిచెల్ 134 రన్స్, విలియమ్సన్ 69 రన్స్తో రాణించినా ఫలితం దక్కలేదు. మిగితా బ్యాట్స్మెన్లలో ఫిలిప్స్ 41 తప్ప ఎవరూ 15 రన్స్ దాటలేదు. భారత బౌలర్లలో షమీ దుమ్ములేపాడు. కివీస్ విన్ అవుతుందా అనేలా ఉన్న పరిస్థితిని టీమిండియా వైపుకు తిప్పేశాడు. కీలకమైన 7 వికెట్లు తీసి కివీస్ను గట్టి దెబ్బకొట్టాడు.

కాగా అంతుకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా దంచికొట్టింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక పోరులో 397 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగి.. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. గిల్ 80, రోహిత్ 47 రన్స్తో రాణించారు. ఓపెనర్ రోహిత్ శర్మ ముందు నుంచే దూకుడుగా ఆడాడు. 29 బాల్స్లో 47 రన్స్ చేసి సౌథీ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత గిల్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే గిల్ రిటైర్డ్ హర్ట్ అవడంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి కోహ్లీ కివీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. కోహ్లీ 113 బంతుల్లో 117, అయ్యర్ 70 బంతుల్లో 105 రన్స్ చేశారు. అయ్యర్ ఏకంగా 8 సిక్సులతో రఫ్పాడించాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 3వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.

Updated : 15 Nov 2023 5:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top