భారత చరిత్రలో ఇదే తొలిసారి.. స్వర్ణం గెలిచిన అవినాశ్
X
చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత అథ్లెట్ చెలరేగుతున్నారు. ఇవాళ జరిగిన ఈవెంట్లలో భారత్ మరో రెండు స్వర్ణాలు దక్కించుకుంది. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, షాట్‌పుట్ విభాగాల్లో ఈ పథకాలు వచ్చాయి. స్టీపుల్‌ఛేజ్ 3000 మీటర్ల రేసులో అవినాశ్ సాబ్లే చరిత్ర సృష్టించాడు. 8:19:50 సెకన్లలో రేస్ ను పూర్తి చేసిన అవినాశ్.. గోల్డ్ మెడల్ సాధించాడు. కాగా, ఈ రేస్ లో భారత్ కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి. 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో హోస్సేన్ ఖేయనీ పేరిట ఉన్న 8:22:79 రికార్డును 0అవినాశ్ బద్దలుకొట్టాడు.
ఇటు మెన్స్ షాట్ పుల్ లో బాహుబలి తేజిందదర్ పాల్ సింగ్ కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. ఈవెంట్ లో అందరికంటే ఎక్కువగా 20.36 మీటర్ల దూరం షాట్ పుట్ విసిరి విజేతగా నిలిచాడు. అంతకుముందు హైదరాబాద్ కు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్.. 50 కిలీల విభాగంలో కాంస్యంతో సరిపెట్టుకుంది. మెన్స్ 50 మీటర్ల ట్రాప్ ఈవెంట్ లో భారత్ కు కాంస్యం దక్కింది. మహిళల 1500 మీటర్ల ఫైనల్ లో హర్మిలన్ రజతంతో మెరిసింది. మెన్స్ 1500 మీటర్ల ఫైనల్ లో అజయ్ సిల్వర్, జిన్సన్ జాన్సన్ కాంస్యం గెలుచుకున్నారు. కాగా ఏషియన్ గేమ్స్ లో భారత్ ఇప్పటి వరకు 48 పతకాలు సాధించింది. అందులో 13 స్వర్ణాలు, 18 రజతాలు, 17 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో భారత్ పాయింట్స్ టేబుల్ లో నాలుగో స్థానంలో నిలిచింది.