Home > క్రీడలు > అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్

అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్

అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్
X

మొత్తానికి భారత్ గెలిచింది. వరుసగా రెండు పరాజయాలత తర్వాత ఇండియా టీమ్ విజయాన్ని నమోదు చేసుకుంది. వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ ల్లో భారత్ కు ఇది కీలక విజయం. గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో సత్తా చూపించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతంత చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బ్రంెడన్ కింగ్ 42 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్ తో 42 పరుగులు చేయగా, రావమన్ పావెల్ 19 బంతుల్లో 40 నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్ కులదీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 83 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. హైదరాబాదీ బ్యాట్స్ మన్ తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో కూడా ఆకట్టుకున్నాడు. 37 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్స్ తో 49 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సూర్య, తిలక్ కలిసి మూడో వికెట్ కు 51 బంతుల్లో 87 పరుగులు జోడించి మ్యాచ్ విన్నింగ్ కు దోహదపడ్డారు. మరోవైపు యశస్వి జైపాల్, శుభ్ మన్ గిల్ పేలవమైన పెర్ఫామెన్స్ తో తక్కువ పరుగులకే క్రీజ్ చేరుకున్నారు. సూర్య కుమార్ మాత్రం చెలరేగిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే హాప్ సెంచరీ చేశాడు. ఇతను అవుట్ అయిపోయాక తిలక్ వర్మ కు జోడీగా హార్దిక్ పాండ్యా వచ్చి 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 20 రన్స్ చేసి మ్యాచ్ ను ముగించాడు.

ఈమ్యాచ్ తో సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. 100 ఇంటర్నేషనల్ మ్యాచ్ టి20ల్లో 100 సిక్స్ లు పూర్తి చేసుకున్నాడు. 1007 బంతుల్లోనే 100 సిక్స్ లు కొట్టాడు. అత్యధిక సిక్సర్ల జాబితాలో భారత్ నుంచి రోహిత్ 182, కోహ్లీ 117 సిక్స్ లతో సూర్య కుమార్ కన్నా ముందున్నారు.

కీలక మ్యాచ్ లో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు హార్దిక్ పాండ్యా. ఆఖరి మూడు మ్యాచ్ లు భారత్ కు ముఖ్యమని ముందే బాయ్స్ కు చెప్పానన్నాడు. పూరన్ కాస్త ఆలస్యంగా బ్యాటింగ్ కు రావడం మాకు కలిసి వచ్చిందని వివరించాడు. పూరన్ కు వ్యతిరేకంగా మేము పక్కా ప్రణాళికతో ఉన్నాం. అతను క్రీజ్ లో ఉంటే నేను బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. అలాగే సూర్య మరోసారి తనేంటో నిరూపించాడు. అతని లాంటి ఆటగాడు జట్టులో ఉంటే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాడని అభినందించాడు.



Updated : 9 Aug 2023 3:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top