IND vs AFG : టాస్ గెలిచిన రోహిత్ సేన.. ఆఫ్గనిస్తాన్ బౌలింగ్
X
బెంగళూరు వేదికగా భారత్ - ఆఫ్గనిస్తాన్ మధ్య మూడో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆఫ్గనిస్తాన్ ఫస్ట్ బౌలింగ్ చేయనుంది. టీంలో భారత్ పలు కీలక మార్పులు చేసింది. అక్షర్, జితేష్, అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టింది. సంజూ శాంసన్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్‌లకు తుది జట్టులో చోటు దక్కింది. అటు ఆఫ్గాన్ కూడా పలు మార్పులు చేసింది.
కాగా ఈ సిరీస్లో టీమిండియా అదరగొడుతుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. ఈ విజయంతో టీ20 ఫార్మట్లో చరిత్ర లిఖించేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచులో గెలిస్తే.. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వైట్ వాష్లు చేసిన జట్టుగా భారత్ నిలుస్తుంది. ఇప్పవరకు ద్వైపాక్షిక టీ20 సిరీసుల్లో అత్యధిక వైట్ వాష్లు (8) చేసిన జట్లుగా.. భారత్, పాకిస్తాన్ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్గాన్ను ఓడిస్తే.. మొత్తం 9 క్లీన్ స్వీప్లతో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా అవతరిస్తుంది. అయితే ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆఫ్గాన్ ప్రయత్నిస్తోంది.
టీమిండియా : రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కోహ్లీ, శివమ్ దూబె, సంజు శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, కుల్‌దీప్ యాదవ్, అవేశ్ ఖాన్
ఆఫ్గనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్,గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ,నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీమ్ సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్