asian games2023: భారత షూటర్ల జోరు.. ప్రపంచ రికార్డ్ నమోదు
X
చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023లో భారత షూటర్ల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే షూటింగ్ లో మొత్తం 15 పతకాలు రాగా.. ఇవాళ మరో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ టీం ఈవెంట్ లో ఐష్వరి ప్రతాప్ సింగ్, స్వప్నిల్ కుశాలె, అఖిల్ షిరన్ బృందం గోల్డ్ గెలుచుకున్నారు. కాగా ఇందులో మొత్తం 1769 పాయింట్లు సాధించిన భారత్ బృందం.. ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇక ఇదే ఈవెంట్ వ్యక్తిగత ప్రదర్శనలో కూడా భారత షూటర్లు ఫైనల్ చేరారు. దాంతో ఇందులోనూ పతకాలు రావడం ఖాయం. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిన్ పిస్టోల్ టీం విభాగంలో ఇషా సింగ్, పాలక్, దివ్య తడిగోల్ టీం సిల్వర్ మెడల్స్ సాధించారు. అంతేకాకుండా వ్యక్తిగత విభాగంలోనూ పాలక్ స్వర్ణం, ఇషా సింగ్ రజత పతకాలు సొంతచేసుకున్నారు. మొత్తం షూటింగ్ లోనే 17 పతకాలు రాగా.. 6 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.
టెన్నిస్ లో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు నిరాశ పరుచగా.. తాజాగా ఆ వెలతి తీరింది. టెన్నిస్ డబుల్స్ లో రజత పతకం సాధించారు మన భారత ప్లేయర్లు. సాకేత్ మైనేని, రామ్ కుమార్ రామనాథన్ జోడీ రజత పతకాలు సొంతం చేసుకున్నారు. ఏషియన్ గేమ్స్ లో రామ్ కుమార్ కు ఇది తొలి మెడల్ కాగా.. సాకేత్ కు మూడోది. కాగా ఇప్పటి వరకు ఏషియన్ గేమ్స్ లో భారత్ కు మొత్తం 30 పతకాలు వచ్చాయి. దీంతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.