Home > క్రీడలు > ICC World Cup india vs New Zealand : న్యూజిలాండ్‌పై భారత్ విజయం

ICC World Cup india vs New Zealand : న్యూజిలాండ్‌పై భారత్ విజయం

ICC World Cup india vs New Zealand : న్యూజిలాండ్‌పై భారత్ విజయం
X

ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. భారత్ ఆ లక్ష్యాన్ని 48 ఓవర్లలోనే ఛేదించి 274 పరుగుల వద్ద ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో మన ఆటగాళ్లు చెలరేగి ఆడి ఈ సిరీస్‌లో వరుసగా ఐదో విజయాన్ని కైవసం చేసుకున్నారు. పేసర్ షమీ ఒక్కడే ఐదు వికెట్లు పడగొట్టాడు. 95 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ శతకాన్ని మిస్సయి మ్యాట్ హెన్రీ వేసిన 47.4 ఓవర్‌కు క్యాచ్ ఔట్ అయ్యాడు. కోహ్లీ ఔట్ అయ్యాక రవీంద్ర జడేజా ఫోన్ మ్యాచ్‌ను ముగించాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్క్‌ను అందుకున్న బ్యాటర్‌గా గిల్‌ రికార్డులకెక్కాడు. 14 పరుగుల వద్ద గిల్‌ ఈ రికార్డు అందుకున్నాడు. గిల్ కేవలం 38 ఇన్నింగ్స్‌లో 2 వేల పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉంది.


Updated : 22 Oct 2023 5:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top