ఛాంపియన్గా భారత్.. కువైట్పై అద్భుత విజయం
X
SAFF (సౌత్ ఏషియన్ ఫుట్ బాల్ ఫెడరేషన్) ఛాంపియన్ షిప్ లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఫైనల్ లో అదరగొట్టి.. ఏకంగా 9వ సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మంగళవారం (జులై 4) రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో 5-4తో కువైట్ ను ఓడించింది. ముందు నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్ల స్కోర్లు 1-1తో సమం కాగా.. పెనాల్టీ షూటౌట్ లో అద్భుతంగా రాణించి 5-4 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
పెనాల్టీ షూటౌట్ లో భారత ఆటగాడు ఉదాంత సింగ్ ఒక పెనాల్టీ మిస్ చేశాడు. మిగతా ఐదు గోల్స్ సక్సెస్ కావడంతో భారత్ 9వ సారి సాఫ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. కువైట్ ఆటగాళ్లు కూడా భారత్ కు గట్టిపోటీ ఇచ్చారు. వరుసగా నాలుగు గోల్స్ చేసి భారత్ కు చెమటలు పట్టించారు. చివర్లో భారత గోల్ కీపర్ గురుప్రతీత్ సింగ్ సంధు కువైట్ ప్లేయర్ హజియా గోల్ చేయకుండా ఆపడంతో భారత్ గెలిచింది. దీంతో సునీల్ ఛెత్రీ నేతృత్వంలోని భారత జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.