PV Sindhu : ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిల జట్టు
X
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో(Asia Team Championships) భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది. మలేషియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో అమ్మాయిలు వారి సత్తా చాటుతున్నారు. దీంతో ఆసియా టోర్నీలో తొలిసారిగా ఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకుంది.
క్వార్టర్‌ఫైనల్లో భారత్ 3-0తో హాంకాంగ్‌పై ఘన విజయం సాధించింది. గ్రూపు దశలో టాప్ సీడ్ చైనాను చిత్తుచేసిన పి.వి.సింధు బృందం.. క్వార్టర్స్‌లో హాంకాంగ్‌ను మట్టికరిపించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో మనకు కాంస్య పతకం ఖాయమైంది. అంతేగాక మహిళల సింగిల్స్ తొలి పోరులో రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు..21-7, 16-21, 21-12తో లో సిన్ యాన్‌పై గెలిచి బోణీ కొట్టింది. కాగా డబుల్స్ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా జోడీ 21-10, 21-14తో యెంగ్ నెగా టింగ్-యెంగ్ లామ్ ల ఇద్దరి పై గెలుపొందింది. మరో సింగిల్స్ మ్యాచ్‌లో యువ షట్లర్ అష్మిత చలిహ 21-12, 21-13తో యెంగ్ సుమ్ యీపై నెగ్గింది. దీంతో 3-0తో భారత్ విజయఢంకాను మోగించింది.
ఇప్పటికే ఫైనల్ కి దూసుకెళ్లిన భారత్..టోర్నీలో సీల్వర్ మెడల్ ను ఖాయం చేసుకుంది. కాగా సెమీస్‌లో జపాన్‌తో భారత్ తలపడేందుకు సిద్ధమైంది. ఫైనల్ లో జపాన్ తో నెగ్గి భారత్ కు గోల్డ్ తీసుకురావాలని యావత్ భారతీయులు కోరుకుంటున్నారు.