Home > క్రీడలు > Asian games 2023: ఫైనల్లో భారత్ ఘన విజయం.. ఒలంపిక్స్ బెర్త్ ఖరారు

Asian games 2023: ఫైనల్లో భారత్ ఘన విజయం.. ఒలంపిక్స్ బెర్త్ ఖరారు

Asian games 2023: ఫైనల్లో భారత్ ఘన విజయం.. ఒలంపిక్స్ బెర్త్ ఖరారు
X

ఏషియన్ గేమ్స్ లో భారత్ కు మరో గోల్డ్ మెడల్ లభించింది. భారత హాకీ జట్టు ఫైనల్ లో జపాన్ ను చిత్తు చేసి.. స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. హోరాహోరీగా ఉంటుందనుకున్న ఫైనల్ లో.. భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 5-1 గోల్స్ తో జపాన్ ను చిత్తు చేసింది. దీంతో భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. కాగా.. ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత పురుషుల జట్టుకు ఇది నాలుగో గోల్డ్ మెడల్ కావడం విశేషం. గతంలో 1966, 1998, 2014 సీజన్లలో భారత హాకీ జట్టు పతకాలు గెలిచింది. తాజాగా ఏషియన్ గేమ్స్ ఫైనల్ లో గెలిపొందిన భారత్.. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్ వెళ్లేందుకు అర్హత సాధించింది.




ఏషియన్ గేమ్స్ లో భారత్ పతకాల వేటలో సెంచరీ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే 22 స్వర్ణాలు, 34 రజతాలు, 39 కాంస్య పతకాలు భారత్ దక్కించుకుంది. ఆర్చరీలో ఇంకో మూడు, కబడ్డీలో రెండు, క్రికెట్ లో ఒక పతకం ఖాయం అయ్యాయి. దీంతో భారత్ రికార్డ్ స్థాయిలో 101 పతకాలను సొంతం చేసుకోనుంది. కాగా ఇవాళ ఒక్క రోజే భారత్ కు 8 పతకాలు వచ్చాయి. మెన్స్ హాకీలో స్వర్ణం, మెన్స్ బ్రిడ్జ్ టీంలో రజతం, మెన్స్ 57 కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో (అమన్‌ సెహ్రావత్‌) కాంస్యం, ఉమెన్‌ 76 కేజీ ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ లో (కిరణ్‌ బిష్ణోయి) కాంస్యం, ఉమెన్‌ 62 కేజీ ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ లో (సోనం మాలిక్‌) కాంస్యం పతకాలు సాధించారు. సెపాక్ టక్రా ఉమెన్స్ టీంకు కాంస్యం, బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ లో హెస్ ప్రణయ్ కు కాంస్యం, ఆర్చరీ రికర్వ్ మెన్స్ టీంలో అతాను, ధీరజ్, తుషార్ లకు రజత పతకాలు లభించాయి.









Updated : 6 Oct 2023 6:33 PM IST
Tags:    
Next Story
Share it
Top