చైనాకు టీమిండియా.. అక్టోబర్ 3 నుంచి..
X
"చైనాలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు టీమిండియా చైనాకు వెళ్లింది. " (Asian Games 2023) రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో యంగ్ టీం చైనాకు వెళ్లింది. మెయిన్ టీం వరల్డ్ కప్ ఆడనున్న నేపథ్యంలో యంగ్ టీం ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. (Indian Cricket Team)టీమిండియా నేరుగా క్వార్టర్స్ ఆడుతుంది. క్వార్టర్స్‌లో గెలిస్తే సెమీస్‌కు.. అక్కడ గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మూడు మ్యాచుల్లో గెలిస్తే టీమిండియాకు పసిడి పతకం ఖాయం.
ఆసియా క్రీడల్లో భాగంగా అక్టోబర్ 3న టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 7న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియన్ ఉమెన్స్ టీం ఇప్పటికే స్వర్ణ పతకాన్ని గెలిచింది. మెన్స్ టీం కూడా పసిడి సాధించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. మరోవైపు ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. వరుస పతకాలతో భారత సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం భారత్ ఖాతాలో మొత్తం 24 పతకాలు ఉన్నాయి.
భారత జట్టు:
రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, శివమ్ దూబె, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఆకాశ్ దీప్