Home > క్రీడలు > Asian Games 2023: చరిత్ర సృష్టించిన టీమిండియా.. హిస్టరీలో తొలి స్వర్ణం

Asian Games 2023: చరిత్ర సృష్టించిన టీమిండియా.. హిస్టరీలో తొలి స్వర్ణం

Asian Games 2023: చరిత్ర సృష్టించిన టీమిండియా.. హిస్టరీలో తొలి స్వర్ణం
X

ఏషియన్ గేమ్స్ లో భారత పురుషుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఫైనల్ లో భారత్ కు గోల్డ్ మెడల్ లభించింది. 18 ఓవర్ల వరకు జరిగిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు. దీంతో టీమిండియాకు స్వర్ణ పతకం వరించింది. టోర్నీలో జరిగిన అన్ని మ్యాచుల్లో గెలిచి, టాప్ సిండింగ్ లో ఉన్న టీమిండియాను గోల్డ్ మెడల్ ప్రకటించారు. వర్షం కురిసే సమయానికి ఆఫ్ఘన్ స్కోరు 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. దీంతో ఏషియన్ గేమ్స్ మెన్స్ క్రికెట్ అడుగుపెట్టిన తొలిసారి.. టీమిండియా బంగారు పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

ఉమెన్ క్రికెట్ టీంకు కూడా స్వర్ణ పతకం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్.. 3 ఓవర్లలో 3 కీలక వికెట్లు కోల్పోయింది. జుబైద్ అక్బరీ 5, మహ్మద్ షాజాద్ 4, నూర్ అలి 1 పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన షాహిదుల్లా కమల్ 49, గుల్బాదిన్ నైబ్ 27 జ‌ట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్ కు 60 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, శివమ్ డూబె, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. 18.2 ఓవర్ లో వర్షం పడటంతో మ్యాచ్ రద్దయింది. భారత్ కు గోల్డ్ మెడల్ రాగా.. ఆఫ్ఘనిస్తాన్ కు రజత పతకం లభించింది. దీంతో భారత్‌ గెలిచిన మెడల్స్ సంఖ్య 101కి చేరింది. ఇప్పటివరకు 26 గోల్డ్, 35 రజతం, 40 కాంస్య పతకాలను దక్కించుకుంది.

Updated : 7 Oct 2023 3:22 PM IST
Tags:    
Next Story
Share it
Top