వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్కు తొలి పతకం
X
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ బోణి కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత పురుష షూటర్లు కాంస్యపతకం సాధించి దేశానికి మొదటి పతకం అందించారు. సరబ్ జ్యోత్‌సింగ్(578), శివ నర్వాల్(579), అర్జున్ చీమా(577) పాయింట్లు సాధించారు. మొత్తం 1734 పాయింట్లు సాధించిన భారత బృందానికి కాంస్య పతకం దక్కింది. కేవలం 9 పాయింట్ల తేడాతో ఇండియా రజత పతకాన్ని కోల్పోయింది.
ఈ ఈవెంట్‌లో చైనా బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. చైనా జట్టు జాంగ్ బోవెన్ (587), లియు జున్‌హుయ్ (582) మరియు షీ యూ (580) 1749 పాయింట్లతో స్వర్ణం దక్కించుకున్నారు. జర్మన్ జట్టు, రాబిన్ వాల్టర్ (586), మైఖేల్ స్క్వాల్డ్ (581) మరియు పాల్ ఫ్రోహ్లిచ్ (576) 1743 స్కోరుతో రజత పతకాన్ని అందుకుంది.
Indian mens team clinches bronze at ISSF World Championship
ISSF World Championship, Indian mens team, 10m air pistol, bronze medal