వరల్డ్ కప్ ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి క్రికెటర్
X
వన్డే వరల్డ్ కప్ 2023కి ఆస్ట్రేలియా 18 మందితో కూడిన తన జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాట్స్ మెన్లను పక్కన పెట్టి మరీ కొత్త కుర్రాళ్ళకు అవకాశం ఇచ్చింది. అలా చోటు దక్కించుకున్న వారిలో భారత సంతతికి చెందిన స్పిన్నర్ తన్వీర్ సంగా ఒకరు. అసలెవరీ తన్వీర్ సంగా...ఆ వివరాలేంటో చూద్దాం.
తన్వీర్ సంగా...భారతీయుడు. ఇతని తండ్రి జోగా సంగా పంజాబ్ లోని జలంధర్ లో పుట్టి పెరిగారు. 1997లో వీరు ఆస్ట్రేలియా వెళ్ళి స్థిరపడ్డారు. జోగా సంగా టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. తల్లి అకౌంటెంట్. వీరి కొడుకు తన్వీర్ సంగా. ఇతనికి ఇప్పుడు 21 ఏళ్ళు. చిన్నప్పటి నుంచి తన్వీర్ కు క్రికెట్ అంటే పిచ్చి. 2020లో ఇతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడు. న్యూ సౌత్ వేల్స్ తరుఫున మొదటిసారిగా ఆడాడు. తరువాత 2020 అండర్ -19 వరల్డ్ కప్ లో కూడా తన సత్తా చాటాడు. తన్వీర్ సంగా స్పిన్నర్. అండర్ -19 వరల్డ్ కప్ లో 6 మ్యాచ్ లలో 15 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసుకున్న వారిలో ఒకడిగా నిలిచాడు.
తన్వీర్ అన్నయ్య జేసన్ సంగా కూడా క్రికెటరే. అతను దేశవాళీ క్రికెట్ లో న్యూ సౌత్ వేల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన్వీర్ ను 2021లో న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సీరీస్ కు సెలక్ట్ చేశారు. కానీ అతనిని ఆడించలేదు. కానీ భారత సంతతికి చెందిన నాలుగో భారత క్రికెటర్ గా మాత్రం తన్వీర్ రికార్డ్ నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ భారత్ లో జరగుతోంది. ఇక్కడ మన దేశ పిచ్ లు అన్నీ స్పిన్నింగ్ కు అనుకూలించేవే ఉంటాయి. కాబట్టి తన్వీర్ కు కచ్చితంగా ఆడించే అవకాశం ఉందని అంటున్నారు. అది కనుక జరిగితే తన్వీర్ పంట పండినట్టే.
తన్వీర్ కంటే ఆస్ట్రేలియా తరుఫున ఆడిన భారత సంతతి క్రికెటర్లలో గురీంధర్ సంధు, స్టువర్ట్ కార్ల్క్, బ్రాన్ బీ కూపర్ లు ఉన్నారు.