మైదానంలో ధోనీ బూతులు తిడతాడు...భారత్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు
X
భారత్ బెస్ట్ కెప్టెన్‌లలో మొదటి స్థానం ధోనిది. దేశానికి రెండు ప్రపంచ్ కప్‌లు అందంచిన సారథిగా చరిత్రకెక్కాడు. నరాలు తెగే ఉత్కంఠలో కూడా కూల్‌గా ఉండడంలో అతడి నైజం. అందుకే అతనిని ప్రపంచవ్యాప్తంగా కెప్టెన్ కూల్‌గా పిలుస్తారు. ధోని సారథ్యంలో ఆడిన ప్రతి క్రికెటర్ అతడిని కెప్టెన్సీని కొనియాడిన వాళ్లే. తాజాగా భారత్ పేసర్ ఇషాంత్ శర్మ ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ధోని అసలు కూల్ కాదని ఇషాంత్ చెప్పాడు. ఫీల్డ్ లో ధోనికి కోపమొస్తే దుర్భాషలాడే వాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను కూడా ఓ సారి ధోని బూతులు మాట్లాడడం విన్నానని ఇషాంత్ చెప్పుకొచ్చాడు. టీఆర్ఎస్ క్లిప్స్ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా ఇషాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "ధోనీ తరచూ కోపగించుకుంటాడు. మహీ భాయ్‌కి చాలా బలాలు ఉన్నాయి. కానీ వాటిలో కూల్ అండ్ కామ్ ఒకటి కాదు. ఓ సారి నేను నా బౌలింగ్ కోటాను పూర్తి చేసుకున్నాను. ఆ సమయంలో ధోని నా దగ్గరకు వచ్చాడు. నువ్వు అలసిపోయావా ? అని అడిగాడు. నేను దానికి అవును అని సమాధానమిచ్చా. నీ వయుస్సు అయిపోయింది ఇక రిటైర్ అయిపో అని అన్నాడు. ఆ మాటలకు నేను ఆశ్చర్యపోయా. నాపై మహీ భాయ్ ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఒక్కసారి మాత్రం ధోని వేసిన త్రోను సరిగ్గా అందుకోలేకపోయాను. మొదటిసారి కోపంగా చూశాడు. రెండోసారి మరింత బలంగా త్రో వేశాడు. అదీ కూడా పట్టుకోలేదు. ఇక మూడో సారికి మాత్రం సీరియస్ అయ్యాడు. చేతిని బంతితో కొట్టుకోమని సైగలు చేశాడు" అని ఇషాంత్ వివరించాడు.
ఇక ధోనీ ఎక్కడుంటే అక్కడ ఎవరో ఒకరు చుట్టూ మూగుతారని ఇషాంత్ తెలిపాడు. ఆ ప్రాంతమంతా చెట్టులు లేని ఊరిని తలపిస్తుందని చెప్పాడు. ఐపీఎల్ లేక ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా ఎప్పుడూ ధోనీ చుట్టూ ఎవరో ఒకరు ఉంటారన్నాడు. రాత్రి పడుకున్నప్పుడే ధోనీ ఒక్కడు ఉంటాడని.. మిగతా సమయంలో అతని రూమ్ లో ఎవరో ఒకరు ఉంటారని అని ఇషాంత్ తెలిపాడు.