Home > క్రీడలు > Team India : నల్ల రిబ్బన్లతో బరిలోకి టీమిండియా ప్లేయర్లు.. అసలేం జరిగింది?

Team India : నల్ల రిబ్బన్లతో బరిలోకి టీమిండియా ప్లేయర్లు.. అసలేం జరిగింది?

Team India : నల్ల రిబ్బన్లతో బరిలోకి టీమిండియా ప్లేయర్లు.. అసలేం జరిగింది?
X

రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించేలా ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్ 314 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ 3 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ 2, బుమ్రా, అశ్విన్, జడేజా తలా ఓ వికెట్ తీసుకున్నారు. కాగా మూడో రోజు ఆటకు టీమిండియా ప్లేయర్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. అది చూసిన ప్రేక్షకులు.. ప్రశ్నించుకోవడం కనిపించింది. ప్లేయర్లు నల్ల రిబ్బన్లు ధరించడం వెనక ఓ కారణం ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్, టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావ్ గైక్వాడ్ (95) ఫిబ్రవరి 13న కన్నుమూశారు. ఆయనకు సంతాపంగా టీమిండియా ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. దత్తాజీరావ్ గైక్వాడ్ 1952లో భారత తరపున అరంగేట్రం చేశారు. 1961 వరకు 11 టెస్టుల్లో భారత్‌కు ప్రాతనిధ్యం వహించారు. 110 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు.










Updated : 17 Feb 2024 1:15 PM IST
Tags:    
Next Story
Share it
Top