Home > క్రీడలు > వరల్డ్ కప్ స్పెషల్.. అహ్మదాబాద్కు ప్రత్యేక ట్రైన్, ఫ్లైట్లు

వరల్డ్ కప్ స్పెషల్.. అహ్మదాబాద్కు ప్రత్యేక ట్రైన్, ఫ్లైట్లు

వరల్డ్ కప్ స్పెషల్.. అహ్మదాబాద్కు ప్రత్యేక ట్రైన్, ఫ్లైట్లు
X

ప్రపంచ కప్ ఫైన్ మ్యాచ్కు అహ్మాదాబాద్ సిద్ధమైంది. టీమిండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే చివరి పోరు కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు అహ్మదాబాద్కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో వారి కోసం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

క్రికెట్ అభిమానుల కోసం రైల్వే శాఖ అహ్మదాబాద్కు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ముంబైలోని ఛత్రపతి శివాజి టెర్మినల్ నుంచి శనివారం రాత్రి 10.30 గంటలకు బయల్దేరనున్న ట్రైన్ ఆదివారం ఉదయం 6.40 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైలు దాదర్, థానే, వసాయ్, సూరత్, వడోదరా స్టేషన్ల మీదుగా అహ్మదాబాద్ చేరుకోనుంది. అక్టోబర్‌ 14న ఇండియా-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా రైల్వే శాఖ అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడిపింది.

మరోవైపు ప్రయాణికుల డిమాండ్‌ మేరకు విస్తారా ఎయిర్‌లైన్స్‌ అహ్మదాబాద్‌కు అదనంగా 8 విమానాలు నడుపుతోంది. నవంబర్‌ 18 నుంచి 20 తేదీల మధ్య వీటిని నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ 8 ఫైట్లలో 5 విమానాలు ముంబై నుంచి, 3 ఢిల్లీ నుంచి బయల్దేరుతాయని సంస్థ ప్రకటించింది.

Updated : 18 Nov 2023 6:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top