Home > క్రీడలు > కోట్లు కొల్లగొడుతున్న అన్క్యాప్డ్ ప్లేయర్స్.. ఎవరు ఎంతకు అమ్ముడు పోయారంటే..?

కోట్లు కొల్లగొడుతున్న అన్క్యాప్డ్ ప్లేయర్స్.. ఎవరు ఎంతకు అమ్ముడు పోయారంటే..?

కోట్లు కొల్లగొడుతున్న అన్క్యాప్డ్ ప్లేయర్స్.. ఎవరు ఎంతకు అమ్ముడు పోయారంటే..?
X

భారత అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఐపీఎల్ 2024 వేలంలో కోట్లు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే సమీర్ రిజ్వీ (8.4 కోట్లు), శుభమ్ దూబె (5.8 కోట్లు) అమ్ముడు పోగా.. ఆ లిస్ట్ లో మరికొంత మంది ప్లేయర్లు కూడా చేరుతున్నారు. రూ.40 లక్షల బేస్ ప్రైజ్ తో వచ్చిన హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ ను రూ. 7.4 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. కుమార్ కుశాగ్రా రూ.20 లక్షల బేస్ ప్రైజ్ తో రాగా.. రూ.7.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. పేస్ బౌలర్ యశ్ దయాల్ ను ఆర్సీబీ రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. సుశాంత్ మిశ్రాను రూ.2.20 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. సిద్ధార్థ్ మణిమరన్ ను రూ.2.4 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.

మిగతా ఆటగాళ్లను కూడా మంచి ధరకే ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. శ్రేయస్‌ గోపాల్‌ను రూ. 20 లక్షలకు ముంబై, మన్వర్‌ సుతార్‌ను రూ. 20 లక్షలకు గుజరాత్‌, ఆకాశ్‌ సింగ్‌ని రూ.20 లక్షలకు హైదరాబాద్, కార్తిక్‌ త్యాగీని రూ.60 లక్షలకు గుజరాత్, రక్షిక్ దార్‌ను రూ.20 లక్షలకు ఢిల్లీ, రికీ భుయ్‌ని రూ.20 లక్షలకు ఢిల్లీ, రమణ్‌దీప్ సింగ్‌ని రూ.20 లక్షలకు కోల్‌కతా, అర్షిన్‌ కులకర్ణిని రూ. 20 లక్షలకు లక్నో జట్లు దక్కించుకున్నాయి. ఇంగ్లాండ్ కు చెందిన టామ్ కోహ్లర్- కాడ్మోర్ ను బేస్ ప్రైస్ రూ.40 లక్షలకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. కాగా సర్ఫరాజ్‌ ఖాన్‌, వివ్రాంత్ శర్మ, అతిత్‌ షేత్, హృతిక్ షోకీన్‌, అర్షద్‌ ఖాన్‌, అగద్ బవా, మురుగన్‌ అశ్విన్‌, పుల్‌కిత్‌ నారంగ్‌ అన్‌సోల్డ్‌గా మిగిలారు.

Updated : 19 Dec 2023 6:57 PM IST
Tags:    
Next Story
Share it
Top