Home > క్రీడలు > Badminton Asia Team Championships : ఆసియా బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించిన భారత్

Badminton Asia Team Championships : ఆసియా బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించిన భారత్

Badminton Asia Team Championships  : ఆసియా బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించిన భారత్
X

బ్యాడ్మింట‌న్ ఆసియా టీమ్ చాంపియ‌న్‌షిప్స్‌ (Badminton Asia Team Championships)లో భార‌త మ‌హిళా జట్టు చరిత్ర సృష్టించింది. మలేషియాలో జ‌రుగుతున్నఈ టోర్నీలో దేశానికి తొలి బంగారు ప‌త‌కాన్ని (Gold Medal) సాధించింది. ఈ టోర్నీ చ‌రిత్రలో ఫైన‌ల్ చేరిన మొద‌టిసారే భార‌త జట్టు గోల్డ్ మెడల్ సాధించడం విశేషం.

ఫైన‌ల్ లో థాయ్‌లాండ్‌ పై 3-2 తేడాతో విజయం సాధించింది. 17 ఏండ్ల అన్మోల్ ఖార్బ్(Anmol Kharb) సంచ‌ల‌నమైన ఆట‌తో పొర్న్‌పిచా చోయ‌కీవాంగ్‌ను చిత్తు చేసి భార‌త్‌కు చారిత్రాత్మ‌క విజయాన్ని అందించింది. లీగ్ ద‌శ‌లోనే చైనాను కుప్పకూల్చిన భార‌త ష‌ట్ల‌ర్లు క్వార్ట‌ర్ ఫైన‌ల్లో హాంకాంగ్‌(Hong Kong)ను చిత్తు చేశారు.

ఇక సెమీఫైనల్లోనూ అదే తీరును కనబరుస్తూ..జ‌పాన్ క్రీడాకారుణుల‌ను ఓడించారు. దాంతో, బ్యాడ్మింట‌న్ ఆసియా టీమ్ చాంపియ‌న్‌షిప్స్ టోర్నీలో తొలిసారి టీమిండియా ఫైన‌ల్లో అడ‌గు పెట్టి చ‌రిత్ర సృష్టించింది. అదికార ఫైనల్లోనూ తమ సత్తా చూపించింది. ఒలింపిక్ మెడ‌లిస్ట్ పీవీ సింధుతో పాటు గాయ‌త్రి గోపిచంద్, ట్రెసా జాలీలు సింగిల్స్‌లో విజ‌య ఢంకా మోగించారు. సుప‌నింద క‌టెథాంగ్‌ను 39 నిమిషాల్లోనే 21-12, 21-12 తో చిత్తు చేసి భార‌త్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపింది.

ఆ త‌ర్వాత గాయ‌త్రి, ట్రెసాలు అద్భుత విజ‌యంతో టీమిండియా 2-0తో థాయ్‌లాండ్‌పై పై చేయి సాధించింది. ఇక విజేత‌ను నిర్ణ‌యించే డిసైడ‌ర్ మ్యాచ్‌లో యువ‌కెర‌టం అన్మోల్ అసాధార‌ణ‌మైన ఆట‌తో ప్ర‌త్య‌ర్థికి చెక్ పెట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో పోర్న్‌పిచాను 21-14, 21-19తో మ‌ట్టిక‌రిపించింది. దాంతో, ఈ టోర్నీ చ‌రిత్ర‌లో తొలి గోల్డ్ మెడల్ సాధించి మువ్వ‌న్నెల జెండాను రెప‌రెప‌లాడించింది.





Updated : 18 Feb 2024 1:33 PM IST
Tags:    
Next Story
Share it
Top