భారత్ తొలి ఇన్నింగ్స్ 477 ఆలౌట్..ఆధిక్యం ఎంతంటే?
X
ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 477 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్ షోయబ్ బషీర్ 5 వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో జేమ్స్ అండర్సన్ 700 వికెట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఆధిక్యం 259 పరుగులుగా ఉంది. తొలి ఇన్నింగ్స్ లో శుభమన్ గిల్, రోహిత్ శర్మలు ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. జైశ్వాల్, పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ అర్థ సెంచరీలతో రాణించారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.