ఇన్‌స్టా స్టార్ అయిన విరాట్ కోహ్లీ కుమారుడు
X
విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతుల కుమారుడు అకాయ్ సోషల్ మీడియాలో స్టార్ అయ్యాడు. మరోసారి తండ్రి అయినట్లు కోహ్లీ ప్రకటించిన వెంటనే ఇన్‌స్టాలో అకాయ్ కోహ్లీ పేరుతో పెద్ద సంఖ్యలో ఫేక్ ఖాతాలు పుట్టుకొచ్చాయి. వాటికి విరాట్ దంపతులు ఫొటోలను డీపీలుగా పెట్టారు. ఇలా నకీలీ ఖాతాలు క్రియేట్ చేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. అకాయ్ పుట్టాడంటూ ఇన్‌స్టాలో కోహ్లీ పెట్టిన పోస్ట్ గంటలోనే 5 మిలియన్ల లైక్‌లను అందుకుంది. తమకు రెండో సంతానంగా అబ్బాయి పుట్టినట్టు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు నిన్న ప్రకటించారు. ఫిబ్రవరి 15నే బాబు జన్మించినట్టు తెలిపారు. వారికి ఇప్పటికే మూడేళ్ల వామిక ఉంది. ఇప్పుడా కుటుంబంలోకి ‘అకాయ్’ వచ్చి చేరాడు. కోహ్లీ ఆ ప్రకటన చేయడంతోనే ప్రపంచం నలుమూలల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘‘అనుష్క-విరాట్ కోహ్లీకి నాలుగు అభినందనలు. ఆర్బీబీ కుటుంబంలోని అతి పిన్న వయస్కుడైన అకాయ్‌కు పెద్ద స్వాగతం.
ఇది చాలా సంతోషకరమైన వార్త. దేశం ఈ రాత్రి హాయిగా నిద్రపోతుంది’’ అని ఐపీఎల్‌లో కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఒక పోస్టులో పేర్కొంది. ‘‘కింగ్ కోహ్లీ నుంచి ప్రిన్స్ కోహ్లీ వరకు.. కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కోహ్లీ కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు’’ అని పంజాబ్ కింగ్ ఎక్స్ చేసింది. అందమైన కుటుంబంలోకి అమూల్యమైన అకాయ్ వచ్చి చేరినందుకు విరాట్, అనుష్కకు అభినందనలు. ఆ పేరే గదిని వెలుగులతో నింపేస్తుంది. అకాయ్ మీ ప్రపంచాన్ని అంతులేని ఆనందం, నవ్వులతో నింపుతాడు. లిటిల్ చాంప్‌కు ఈ ప్రపంచంలోకి స్వాగతం’’ అని సచిన్ ఎక్స్ చేశాడు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. అనుష్క శర్మ ఫిబ్రవరి 15న ఓ బాబుకి జన్మనిచ్చింది. ఇంతకు ముందు ఈ దంపతులకు వామిక అనే పాప ఉండగా.. ఇప్పుడు బాబు జన్మించాడు. దీంతో కోహ్లి ఫ్యామిలీ పర్‌ఫెక్ట్ 4గా మారింది. కుమారుడికి అకాయ్ అని పేరు పెట్టారు. అనుష్కకు ఫిబ్రవరి 15న డెలివరీ అయితే.. 20వ తేదీన ఈ విషయాన్ని ప్రకటించారు. ఎంతో అంకిత భావంతో క్రికెట్ ఆడే కోహ్లి అనుష్క డెలివరీ కోసం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు