Cricket in Olympics: క్రికెట్కు అనుమతి.. టీమిండియాకు రెండు పతకాలు ఖాయం
X
ఒలింపిక్స్ కు 128 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక అప్పటి నుంచి క్రికెట్ ను ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఆ ప్రయత్నానికి, క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో జరగబోయే ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చారు. క్రికెట్ తో పాటు బేస్ బాల్, సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లాక్రోసీ క్రీడలను కూడా 2028 ఒలింపిక్స్ లో చేర్చారు. ఇవాళ (అక్టోబర్ 13) ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్ నిర్వాహకుల ప్రతిపాదనను.. ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ కమిటీ (ఐఓసీ) అనుమతిచ్చింది. 2028 ఒలంపిక్స్ లో క్రికెట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 120 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్ రీఎంట్రీ ఇస్తుంది. ఒలంపిక్స్ లో క్రికెట్ ను టీ20 ఫార్మట్ లో చూడొచ్చు.
1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో మొదటిసారి క్రికెట్ ను ప్రవేశపెట్టారు. అందులో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ జట్లు మాత్రమే తలపడ్డాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో క్రికెట్ ను ఒలింపిక్స్ నుంచి తొలగించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చాలా అనుకులంగా ఉన్నాయి. దీంతో ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలనే డిమాండ్ మొదలయింది. ఇప్పటి వరకు చాలాసార్లు దీపిపై చర్చలు జరిగినా.. కార్యరూపం దాల్చలేదు. అయితే లాస్ ఏంజిలెస్ లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలని నిర్వాహకులు ప్రతిపాదించగా.. ఐఓసీ ఆమోదించింది. దీనిపట్ల ఐసీసీ సంతోషం వ్యక్తం చేసింది. దీంతో ఐఓసీకి భారీ లాభం దక్కనుంది. ఇప్పటి వరకు ఒలంపిక్స్ ప్రసార హక్కుల ద్వారా రూ. 158 కోట్ల వరకు ఐఓసీ అర్జిస్తోంది. అయితే ఒలంపిక్స్ లో క్రికెట్ చేరితే.. ప్రసార హక్కుల విలువ భారీగా పెరుగుతుంది. దాదాపు రూ. 15వేల కోట్లు వచ్చే వచ్చే అవకాశం ఉంది.