Home > క్రీడలు > IPL 2024 schedule: సగం మ్యాచులకే షెడ్యూల్ విడుదల.. తొలి పోరులో తలపడేది ఎవరంటే?

IPL 2024 schedule: సగం మ్యాచులకే షెడ్యూల్ విడుదల.. తొలి పోరులో తలపడేది ఎవరంటే?

IPL 2024 schedule: సగం మ్యాచులకే షెడ్యూల్ విడుదల.. తొలి పోరులో తలపడేది ఎవరంటే?
X

పొట్టి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లే తలపడనున్నాయి. మార్చి 23న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. కాగా ఎన్నికల నేపథ్యంలో 21 మ్యాచులకే నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మ్యాచులు మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరగనున్నాయి. ఎన్నికల తేదీలు ఖరారయ్యాక ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ రానుంది. తొలి 21 మ్యాచులకు చెన్నై, ముంబై, మొహాలీ, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో, విశాఖపట్నం వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.


Updated : 22 Feb 2024 6:38 PM IST
Tags:    
Next Story
Share it
Top