Home > క్రీడలు > ఎన్నికలున్నా భారత్లోనే ఐపీఎల్ నిర్వహిస్తాం.. కానీ: ఐపీఎల్ చైర్మన్

ఎన్నికలున్నా భారత్లోనే ఐపీఎల్ నిర్వహిస్తాం.. కానీ: ఐపీఎల్ చైర్మన్

ఎన్నికలున్నా భారత్లోనే ఐపీఎల్ నిర్వహిస్తాం.. కానీ: ఐపీఎల్ చైర్మన్
X

ప్రతీ ఏడు లాడే ఈసారి కూడా వేసవి మజాను అందించేందుకు ఐపీఎల్ 2024 సిద్ధమైంది. అయితే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. ఐపీఎల్ దుబాయ్ లో నిర్వహిస్తారంటూ వార్తలు వచ్చాయి. అదే నిజం అన్నట్లు మినీ వేలం కూడా దుబాయ్ లోనే ఏర్పాటుచేశారు. దీంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ మొదలైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అభిమానులకు కిక్కిచ్చే వార్తను చెప్పేందుకు బీసీసీఐ సిద్ధం అయినట్లు తెలుస్తుంది. తాజాగా ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ అరుణ్ ధమాల్ స్పందించారు. సార్వత్రిక ఎన్నికలున్నా.. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీని భారత్ లోనే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఎన్నికలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వంతో, ఇతర సంస్థలతో చర్చించి ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు చేస్తామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే.. తాము ఐపీఎల్ షెడ్యూల్ విడదుల చేస్తామని తెలిపారు. ఒకవేళ మ్యాచ్ ల నిర్వహణకు ఆయా రాష్ట్రాలు సముకత చూపకపోతే.. వేరే వేదికలు ఆ మ్యాచ్ ను తరలిస్తారు. అయితే ఐపీఎల్ 2024ను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాకే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. మార్చి 22 నుంచి అని వార్తలు వస్తున్నా.. ఎన్నికలు ఏప్రిల్ లో జరిగే అవకాశం ఉంది. కాగా జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికలపై టీ20 వరల్డ్ కప్ జరగనుంది.


Updated : 14 Feb 2024 6:20 PM IST
Tags:    
Next Story
Share it
Top