ఆంధ్రకు ఐపీఎల్ టీమ్.. ఫలించిన అన్న ప్రయత్నం
X
ఇప్పటి వరకు ఐపీఎల్ లో దాదాపు ప్రతి రాష్ట్రం నుంచి ఓ టీం ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్ విషయంలోనే నిరాశ మిగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు డక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లను హోం టీమ్స్ గా పరిగణంలోకి తీసుకున్నారు. కానీ, రాష్ట్రం విడిపోయాక పరిస్థితి మారిపోయింది. తమ రాష్ట్రానికి ఓ ఐపీఎల్ టీం ఉంటే బాగుండని ఆంధ్ర ఫ్యాన్స్ కోరిక. ఆ కోరిక ఇప్పుడు ఫలించేలా కనిపిస్తుంది.
ఐపీఎల్ కోసం బీసీసీఐ కొత్త ఫ్రాంఛైజీలకు అవకాశం ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. దాంతో బిడ్డింగ్ దక్కించుకునే దిశగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దానికోసం ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. ఆటగాళ్ల ప్రాక్టీస్ కు అత్యాధునిక వసతులు ఏర్పాటుచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. విశాఖ స్టేడియం ఏపీ ఐపీఎల్ టీం హోం గ్రౌండ్ అవుతుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.