Hardik Pandya : ఐపీఎల్ ట్రేడింగ్.. తిరిగి ముంబై జట్టుకే హార్దిక్ పాండ్యా!?
X
ఐపీఎల్ ఫీవర్ అప్పుడే మొదలైంది. డిసెంబర్ లో వేలం పాట, దానికంటే ముందు ప్లేయర్ల ట్రేడింగ్ ఉండటంతో ఏ జట్టుకు ఏ ఆటగాడు వెళ్తాడాఅని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హార్దిక్ పాండ్యా గుజరాత్ గూటిని వీడుతున్నాడని, మళ్లీ ముంబైకే వస్తున్నాడని అంటున్నారు. తొలి ఏడాదిలోనే జట్టును విజేత నిలబెట్టి, రెండో సారి ఫైనల్స్ కు చేర్చిన హార్దిక్ ను గుజరాత్ నిజంగానే వదులుకుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. గుజరాత్ టైటాన్స్ నిజంగానే హార్దిక్ ను వదులుకునే ప్రయత్నం చేస్తుందాఅని చర్చలు మొదటలయ్యాయి. ఫ్రాంచేజీలు పరస్పర అంగీకారంలో ప్లేయర్లను మార్చుకునే ట్రేడింగ్ విండో మరో రోజులో ముగుస్తుండటంతో.. అంతా ఆసక్తి నెలకొంది. ఏ ప్లేయర్ ఏ జట్టులోకి వెళ్తాడని ఎదురుచూస్తున్నారు. అయితే హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ విషయంపై అటు గుజరాత్ గానీ, ఇటు ముంబైగానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనిపై రేపటితో స్పష్టత రానుంది.
2022 ఐపీఎల్ సీజక్ ముందు ముంబై పాండ్యాను వదులుకోగా.. అతన్ని గుజరాత్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘పాండ్యా ముంబై జట్టుకు మారడంపై చర్చలు జరిగాయి. అతను ఫ్రాచేజి మారే అవకాశం ఉంది. అయితే ఒప్పందం ఇంకా పూర్తి కాలేద’ని గుజరాత్ జట్టు వర్గాలు తెలిపాయి. కాగా ట్రేడింగ్ లో భాగంగా పాండ్యాకు బదులుగా ముంబై ఎవరిని పంపుతుందనేదానిపై సమాచారం లేదు. ఒకవేళ పాండ్యా నిజంగానే ముంబైకి తిరిగొస్తే.. కెప్టెన్ అవుతాడా లేద రోహిత్ శర్మ సారథ్యంలోనే ఆడతాడా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ పాండ్యా నిజంగానే గుజరాత్ ను వీడితే కెప్టెన్ గా ఆ జట్టు శుభ్ మన్ గిల్ ను ప్రకటిస్తుంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ శార్దూల్ ఠాకూర్, లోకి ఫెర్గూసన్, టిమ్ సౌథీలను వదులుకునేందుకు సిద్ధమైందని సమాచారం. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడు సామ్ కరన్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించిందట.