నేడు ఐర్లాండ్‌తో రెండో టీ20...సిరీస్ పై భారత్ కన్ను
X
ఐర్లాండ్ పర్యటనలో భాగంగా మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ రెండో టీ20కి సిద్ధమైంది. ది విలేజ్ మైదానంలో ఆదివారం రాత్రి 7.3గంటలకు భారత్, ఐర్లాండ్ మధ్య రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మూడు టీ20ల సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు రెండో టీ20 గెలిచి సిరీస్‌లో నిలవాలని ఐర్లాండ్ చూస్తోంది.
బుమ్రా నాయకత్వంలో భారత్ యువ జట్టు బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటే ఆటగాలున్నారు. గత మ్యాచ్‌లో రీఎంట్రో ఇచ్చిన బుమ్రా పాత రోజులను గుర్తు చేశాడు. మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి రాణించాడు. ప్రసిధ్ కృష్ణ, స్పిన్నర్ రవి బిష్ణోయ్ అంచనాలను అందుకున్నారు. బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లు జైశ్వాల్, రుతురాజ్ మంచి టచ్‌లో కనిస్తున్నారు. మొదటి టీ20లో తిలక్ వర్మ డకౌట్ అయినా అతడు సూపర్ ఫామ్‌లో టీమిండియాకు బలం. వీరితో పాటు సంజూశాంసన్, రింకూసింగ్, దూబేలు చెలరేగితే ఐర్లాండ్‌కు కష్టమే. తొలి టీ20లో ఐర్లాండ్ టాపార్డర్‌ను సులువుగా కట్టడి చేసిన భారత బౌలర్లు లోయర్ ఆర్డర్ వికెట్లు పడగొట్టడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ లోటుపాట్లను సరిచేసుకుంటే బుమ్రాసేనకు ఎదురుండదు.
ఐర్లాండ్ పసికూనైనా టీ20లో మాత్రం డేంజరస్ జట్టు. ఆ టీమ్‌లో ప్రమాదకర హిట్టర్స్ ఉన్నారు. వారు చెలరేగితే భారత్ కు విజయం అంత సులభంగా దక్కకపోవచ్చు. స్టిర్లింగ్, బాల్‌బిర్నీ, టెక్టార్ లు బ్యాటింగ్‌లో కీలకం కాగా, బౌలింగ్‌లో లిటిల్, యంగ్, క్యాంఫర్ తో జాగ్రత్తగా ఉండాలి.
జట్లు (అంచనా):
భారత్: యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, బుమ్రా (కెప్టెన్), అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ
ఐర్లాండ్: స్టిర్లింగ్ (కెప్టెన్), బల్బిర్నీ, టక్కర్, టెక్టర్, క్యాంపర్, డాక్‌రెల్, మార్క్ అడైర్, మెకార్తీ, యంగ్, జోష్ లిటిల్, బెన్‌వైట్.