Home > క్రీడలు > టీమిండియాను కట్టడి చేస్తున్న ఐర్లాండ్.. కీలక వికెట్లు డౌన్

టీమిండియాను కట్టడి చేస్తున్న ఐర్లాండ్.. కీలక వికెట్లు డౌన్

టీమిండియాను కట్టడి చేస్తున్న ఐర్లాండ్.. కీలక వికెట్లు డౌన్
X

డబ్లిన్ వేదికపై టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ఇరు జట్లు జట్టులో ఏ మార్పు చేయకుండా బరిలోకి దిగాయి. రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుందామని టీమిండియా.. సిరీస్ రేసులో ఉండాలని ఐర్లాండ్ గట్టి పోటీని ఇచ్చుకుంటున్నాయి. ఫలితంగా నాలుగు ఓవర్లు ముగిసేసరికి రెండు కీలక వికెట్లు కోల్పోయింది. దాటిగా ఆడిన ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (18,11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్), తిలక్ వర్మ (1,2 బంతుల్లో) వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దాంతో టీమిండియా కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం క్రీజులో గైక్వాడ్ (18,16 బంతుల్లో), శాంసన్ (4, 5 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. ఇదే డబ్లిన్ వేదికపై జరిగిన తొలి టీ20లో డీఎల్ఎస్ మెథడ్ ప్రకారం టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.

తుది జట్లు:

ఐర్లాండ్ (ప్లేయింగ్ XI): ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్(సి), లోర్కాన్ టక్కర్(w), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజు శాంసన్(w), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(c), రవి బిష్ణోయ్

Updated : 20 Aug 2023 8:31 PM IST
Next Story
Share it
Top