Home > క్రీడలు > Ishan Kishan: ఇషాన్ కిషన్కు మానసిక సమస్యే లేదు.. కావాలనే అబద్ధం చెప్పాడు

Ishan Kishan: ఇషాన్ కిషన్కు మానసిక సమస్యే లేదు.. కావాలనే అబద్ధం చెప్పాడు

Ishan Kishan: ఇషాన్ కిషన్కు మానసిక సమస్యే లేదు.. కావాలనే అబద్ధం చెప్పాడు
X

మానసిక సమస్యల వల్ల టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్‌ కిషన్‌.. క్రికెట్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయానికి సంబంధించి ఒక వార్త.. క్రికెట్‌ వర్గాల్లో హల్ చల్‌ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే టీ20 సిరీస్ కు తాను అందుబాటులో ఉంటానని బీసీసీఐకి చెప్పగా.. సెలక్టర్లు కావాలనే ఇషాన్ ను పరిగణంలోకి తీసుకోలేదని తెలుస్తుంది. ఇషాన్ ను ఎందుకు ఎంపిక చేయలేదని అభిమానులు, విమర్శకులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుండగా.. దాని వెనక ఓ బలమైన కారణం ఉందని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇషాన్ కిషన్ తన కుటుంబంతో కలిసి గడిపేందుకు మానసిక అలసట అని చెప్పి.. దుబాయ్ లో పార్టీలకు వెళ్లాడు. ఇదంతా ఓ అబద్ధం. పార్టీలకు వెళ్లేందుకు ఈ సాకు చూపాడని బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంగా ఆఫ్గాన్ సిరీస్ కు అతన్ని సెలక్ట్ చేయలేదని తెలుస్తుంది.

వన్డే వరల్డ్ కప్ కన్నా ముందు నుంచే ఇషాన్ కిషన్ జట్టులో భాగం అయ్యాడు. కానీ, ప్లేయింగ్ లెవన్ లో మాత్రం చోటు దక్కలేదు. బెంచ్ కే పరిమితమైన ఇషాన్.. ఇక అప్పటి నుంచి మానసిక ఇబ్బందులకు గురయ్యాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ తో పాటు.. సౌతాఫ్రికా సిరీస్ కు దూరంగా ఉండాలని భావించాడు. అయితే బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అది పట్టించుకోక.. అతన్ని సెలక్ట్ చేసి, మళ్లీ బెంచ్ కే పరిమితం చేశారు. చివరికి టెస్ట్ సిరీస్ కు మాత్రం అందుబాటులో ఉండనని.. కుటుంబంతో కలిసి గడిపేందుకు అవకాశం ఇవ్వాలని గట్టిగా సెలక్టర్లను కోరడంతో.. ఇషాన్ ఎంపిక చేయలేదు. కాగా ఆఫ్ఘాన్ తో టీ20 సిరీస్ లో అందుబాటులో ఉంటానని సెలక్టర్లకు చెప్పగా.. దాన్ని వారు పట్టించుకోలేదు. దీంతో ఇషాన్ కు అతని అభిమానులు మద్దతునిస్తున్నారు. బ్రేక్ తీసుకున్న ప్లేయర్ ఎక్కడికి వెళ్తే ఏంటి? అతనికి స్వేచ్ఛ లేదా? దానికి జట్టుకు దూరం చేస్తారా అని బీసీసీఐపై మండిపడుతున్నారు. కాగా తన సోదరుడి పుట్టిన రోజు వేడుకల కోసం.. ఇషాన్ కిషన్ దుబాయ్ కి వెళ్లాడు.




Updated : 10 Jan 2024 3:54 PM IST
Tags:    
Next Story
Share it
Top