Home > క్రీడలు > Isham Kishan : బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన ఇషాన్ కిషన్

Isham Kishan : బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన ఇషాన్ కిషన్

Isham Kishan :  బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన ఇషాన్ కిషన్
X

సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను కూడా బీసీసీఐ తప్పించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇషాన్ కిషన్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా టెస్ట్ సీరిస్‌లో ఆడేందుకు బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను ఇషాన్ కిషన్ తిరస్కరించాడని తెలుస్తోంది. ఈ విషయాన్నే బీసీసీఐ కూడా స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు ఇషాన్ విశ్రాంతి కావాలని అడిగినట్లు తెలిపింది.

విశ్రాంతి కోరినా కూడా ఇషాన్ కిషన్ సొంతంగా ప్రాక్టీసు చేసుకుంటున్నాడని, ఆ విషయాన్ని నేషనల్ క్రికెట్ అకాడమీకి, తన జార్ఖండ్ యూనిట్‌కి కూడా రిపోర్ట్ చేయలేదని బీసీసీఐ వివరించింది. ఇకపోతే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో టీమిండియా టెస్ట్ స్క్వాడ్ నుంచి అతన్ని బీసీసీఐ తప్పించింది. అయితే రంజీ ట్రోఫీలో ఆడొచ్చని బీసీసీఐ తెలిపినా ఆడేందుకు అందుబాటులోకి రాలేదు. అవకాశం ఉన్నప్పటికీ రంజీల్లో శ్రేయస్ అయ్యర్ ఆడలేదు. దీంతో బీసీసీఐ సీరియస్ అయ్యింది.

కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లు రంజీ టోర్నీల్లో ఆడడాన్ని తప్పనిసరి చేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రంజీ ట్రోఫీల్లో ఆడేందుకు శ్రేయస్ అయ్యర్‌తో పాటుగా ఇషాన్ కిషన్ కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో వారిద్దరికీ బీసీసీఐ షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి వారిద్దరినీ తప్పిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇకపై వారిద్దరూ టీమిండియా జట్టులో ఆడే అవకాశం ఉండదు. ఈ ఘటనతో ఇతర క్రికెటర్లు అలర్ట్ అయ్యారు. రంజీ ట్రోఫీల్లో ఆడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Updated : 2 March 2024 5:29 PM IST
Tags:    
Next Story
Share it
Top