Home > క్రీడలు > ఇషాన్ కిషన్కు షాక్.. జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు

ఇషాన్ కిషన్కు షాక్.. జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు

ఇషాన్ కిషన్కు షాక్.. జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు
X

డాషింగ్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ కు టీమిండియా సెలక్టర్లు షాకిచ్చారు. సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి ఇషాన్ కిషన్ ను తప్పించారు. అతని స్థానంలో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ ను సెలక్టర్లు జట్టులో చోటు కల్పించారు. ఈ నెల 26న మొదటి టెస్ట్ ప్రారంభంకానుంది. టెస్టుల్లో ఇషాన్ కు పెద్దగా ఎక్స్ పీరియన్స్ లేకపోవడం కారణంగా అతన్ని జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. కేఎస్ భరత్ కు టెస్టుల్లో అనుభవం ఉంది. అంతేకాకుండా.. ఇటీవల జరిగిన దేశవాళీ, రంజీ ట్రోఫీల్లో అద్భుతంగా రాణించాడు.

కాగా ఇప్పటికే గాయాల కారణంగా టీమిండియాకు ఇద్దరు ఆటగాళ్లు దూరమైన విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్కు మహమ్మద్ షమీ దూరం కాగా.. వన్డేల నుంచి దీపక్ చాహర్ తప్పుకున్నాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా వన్డే సిరీస్ నుంచి బౌలర్ దీపక్ చాహర్ తప్పుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా షమీ ఫిట్ నెస్ పై మెడికల్ టీం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. షమీ స్థానంలో ఆకాశ్ దీప్ ను ఎంపిక చేసింది.

టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (C), శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (wk), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (VC), ప్రసిద్ధ్ కృష్ణ, KS భరత్ (wk)

Updated : 17 Dec 2023 6:14 PM IST
Tags:    
Next Story
Share it
Top