Home > క్రీడలు > Deepak Chahar : ధోనీ లేకుండా చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఊహించడం కష్టమే..దీపక్ చాహర్

Deepak Chahar : ధోనీ లేకుండా చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఊహించడం కష్టమే..దీపక్ చాహర్

Deepak Chahar : ధోనీ లేకుండా చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఊహించడం కష్టమే..దీపక్ చాహర్
X

(Deepak Chahar) ఎన్ని క్రికెట్ మ్యాచ్ లు చూసినా ఐపీఎల్ కు ఉన్న ఫ్యాన్ బేసే సపరేటు..అయితే ఐపీఎల్ లో ఫైనల్స్ వెళ్లే సామర్థ్యం ఏ టీమ్ కి ఉంది అనగానే ముందుగా మనకు టక్ మని గుర్తుకు వచ్చే పేరు చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకంటే దానికి కారణం కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎల్లో ఆర్మీ అంతా ధోనీని ముద్దుగా "తలా" అని పిలుచుకుంటారు. మాజీ క్రికెటర్లే కాదు యువ క్రికెటర్లు కూడా చాలామంది ధోనిని రోల్ మోడల్ గా తీసుకుంటారు. మిస్టర్ కూల్ గురించి టీమ్‌ఇండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.





భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఇంకా రెండు, మూడు ఐపీఎల్‌ సీజన్‌లు ఆడగలడన్నాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు, టీమ్‌ఇండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌. గత ఐపీఎల్‌ సీజన్‌లో మోకాలి గాయం కారణంగా టోర్నీ అంతా ఇబ్బంది పడ్డ ధోనీ..శస్త్ర చికిత్స చేయించుకుని ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని చెప్పాడు. ధోనీ క్రికెట్‌కు ఇవ్వాల్సింది చాలా ఉందని...ఇంకా 2, 3 ఐపీఎల్‌ సీజన్‌లు ఆడగలిగే సత్తా మాహీలో ఉందని స్పష్టం చేశాడు. అలా ఆడాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. అంతేగాక ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని...తుది నిర్ణయం ధోనీదేనని అన్నాడు. గాయం నుంచి త్వరగా కోలుకున్నాడని చెప్పుకొచ్చాడు. మహీ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయడం తను చూసినట్లుగా..తన చివరి మ్యాచ్‌ చెన్నైలోనే అని అందరికీ చెప్పినట్లు తెలిపాడు చాహర్. ధోనీ లేకుండా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును ఊహించడం కష్టమేనని... ఎందుకంటే సీఎస్‌కే అంటేనే...మాహీ భాయ్‌ అని చెప్పాడు.





ధోనీకి క్లోజ్‌ అవ్వడానికి తనకు 2 , 3 ఏండ్లు పట్టిందన్నాడు. అతడిని తన పెద్ద అన్నయ్యలా చూస్తానని..అలాగే ధోనీ తనను తమ్ముడిగా భావిస్తాడని చెప్పాడు. మా ఇద్దరి మధ్య సరదా క్షణాలు చాలా ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు. లాక్‌డౌన్‌ లో ఇద్దరం కలిసి పబ్‌జీ ఆడేవాళ్లమని తెలిపాడు. మైదానం వెలుపల అతడితో చాలా సమయం గడిపానట్లు...మాహీ నుంచి చాలా నేర్చుకున్నానట్లు చెప్పాడు. కేవలం ధోనీ భాయ్‌ వల్లే తను టీమ్‌ఇండియాకు ఆడగలిగానని ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. అంతకుముందు 2018 ఐపీఎల్‌ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇచ్చినట్లు దీపక్ చాహర్‌ చెప్పాడు.




Updated : 30 Jan 2024 11:59 AM IST
Tags:    
Next Story
Share it
Top