సర్పరాజ్‌కు క్షమాపణ చెప్పిన రవీంద్ర జాడేజా
X
టిమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జాడేజా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు క్షమాపణ చెప్పారు. ఈ రోజు ఇంగ్లండ్‌తో టెస్టు ద్వారా జట్టులోకి అరంగట్రేం చేసిన సర్ఫరాజ్ అదరగొట్టారు. 62 రన్స్ వద్ద మంచి ఫామ్‌లో ఉండగా 99 పరుగుల వద్ద ఉన్న జాడేజా రన్ కోసం కాల్ ఇచ్చాడు. మళ్లీ వెంటనే వద్దని చెప్పడంతో అప్పటికే సర్పరాజ్ రనౌట్ అయ్యాడు. కాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జాడేజా బాధగా ఉంది. నాదే తప్పు నువ్వు బాగా ఆడావు అని పోస్ట్ చేశారు. ఈ క్రమంలో అనుకోకుండా జడేజా మూలంగా సర్ఫరాజ్ రన్ అవుట్ కావాల్సి వచ్చింది. దీంతో తన వల్లే అరంగేట్ర మ్యాచ్‌లో సర్ఫరాజ్ వెనుదిరిగాడని జడేజా మనసులో బాధ పెరిగిపోయింది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దీనిపై జడేజా స్పందించారు.‘చాలా బాధగా ఉంది. తప్పంతా నాదే.. నువ్వు చాలా బాగా ఆడావు’’ అని జడ్డూ స్టోరీ పెట్టారు. దీనికి క్రీడాభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటివి జరుగుతుంటాయి వదిలేయ్ భయ్యా అంటూ కొందరు జడేజాకు అండగా నిలుస్తుండగా.. జడేజా స్వార్థపరుడు అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా చెలరేగారు. సెంచరీలతో దుమ్ములేపిన వీరిద్దరు నాలుగో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరు ఆదుకున్నారు.