Home > క్రీడలు > మేమంతా ఆడేది దేశం కోసమే-కపిల్ కు జడేజా కౌంటర్

మేమంతా ఆడేది దేశం కోసమే-కపిల్ కు జడేజా కౌంటర్

మేమంతా ఆడేది దేశం కోసమే-కపిల్ కు జడేజా కౌంటర్
X

టీమ్ లో ఉన్న ప్రతీ ఒక్కరు ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నవాళ్ళే. అందరూ దేశం కోసం అడుతున్నవాళ్లమే. ఇక్కడ ఎవ్వరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు అంటూ నిన్నటి కపిల్ మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రవీంద్ర జడేజా. టీమ్ ఓడిపోతున్నప్పుడు ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. అంత మాత్రాన అవి నిజమయిపోవడని చెప్పాడు. ప్రస్తుతం జట్టు అంతా ప్రతిభావంతమైన ఆటగాళ్ళతో నిండి ఉందని...ఎవరికీ ఎలాంటి అహంకారం లేదని చెప్పాడు.

ఆడే అవకాశం వచ్చిన ప్రతీసారి అందరూ 100 శాతం ఎఫెర్ట్స్ పెట్టి టీమ్ ని గెలిపించడానికే కృషి చేస్తారని అన్నాడు జడ్డూ. జట్టులో స్థానం కాపాడుకోవడం అందరికీ ముఖ్యమే అని చెప్పాడు. నేను పెద్దగా సోషల్ మీడియా చూడను కాబట్టి కపిల్ దేవ్ ఆ మాటలు ఎప్పుడు, ఎందుకు అన్నారో తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం నిజం అని చెప్పుకొచ్చాడు. అయితే ఐపీఎల్ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఆటగాళ్ళకు అహంకారం ఏమీ లేదని మాత్రం సమర్ధించాడు.

తమలో ఎవ్వరికీ అవకాశాలు ఊరికే, ఏదోలా రాలేదు. అందరూ కష్టపడుతున్నారు. తమ అత్యుత్తమ ప్రదర్శన అన్ని సార్లూ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నారు అంటూ టీమ్ ఇండియా సభ్యులును వెనకేసుకొచ్చాడు జడేజా. వెస్టిండీస్ కు ముందు జరిగిన మీడియా సమావేశంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈరోజు విండీస్ తో మూడో వన్టే మ్యాచ్ జరగనుంది. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ట్రోఫీని సొంతం చేసుకుంటారు. తమ జట్టు కచ్చితంగా మ్యాచ్ గెలుస్తుందని జడేజా ధీమా వ్యక్తం చేశాడు.



Updated : 1 Aug 2023 3:05 PM IST
Tags:    
Next Story
Share it
Top