Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత..కోహ్లి రికార్డ్ సమం
X
టీమిండియా సెన్సెషనల్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఇండియా ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో రన్ మిషన్, కింగ్ విరాట్ కోహ్లి రికార్డును యశస్వి సమం చేశాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లలో ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లుగా కోహ్లి, యశస్విలు సమానంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వీరిద్దరు కూడా టెస్ట్ లల్లో 655 పరుగులు చేశారు.
రాంచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో యశస్వి 44 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. ఈ పరుగులతోనే యశస్వి.. కోహ్లి రికార్డును సమం చేశాడు. అయితే ఇంగ్లాండ్, భారత్ మధ్య చివరి టెస్ట్ ఇంకా మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లి రికార్డును యశస్వి బద్దలు కొట్టే అవకాశం లేకపోలేదు. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఇప్పటి వరకు ఉన్న టాప్ 5..
యశస్వి జైస్వాల్ – 655* పరుగులు (2024)
విరాట్ కోహ్లీ – 655 (2016)
రాహుల్ ద్రవిడ్ – 602 (2002)
విరాట్ కోహ్లీ – 593 (2018)
విజయ్ మజ్రేకర్ – 586 (1962)